తెలంగాణ బీజేపీలో విషాదం.. సీనియర్ నేత మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూత

Published : Nov 13, 2022, 12:59 PM IST
తెలంగాణ బీజేపీలో విషాదం.. సీనియర్ నేత మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూత

సారాంశం

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత మందాడి సత్యనారాయణ రెడ్డి మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ రెడ్డి.. హనుమకొండలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత మందాడి సత్యనారాయణ రెడ్డి మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ రెడ్డి.. హనుమకొండలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మందాడి సత్యనారాయణ మృతిపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబం సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. సత్యనారాయణ రెడ్డి మరణం పార్టీకి తీరని  లోటని బండి సంజయ్ అన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా సత్యనారాయణ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపారు. 

మందాడి సత్యనారాయణ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడలో జన్మించారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో  సత్యనారాయణ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Sridhar Babu Comments: భూములు కోల్పోయిన రైతుల సమస్యలను పరిష్కరిస్తాం | Asianet News Telugu
Hyderabad: నెల‌కు రూ. 67 ల‌క్ష‌ల అద్దె.. హైద‌రాబాద్‌లో ఫేస్‌బుక్ పెద్ద స్కెచ్