ఉమ్మడి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై యువజన సంఘాలు దాడికి ప్రయత్నించాయి. దాడికి యత్నించిన యువజన సంఘాలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.
కరీంనగర్:మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు ఆదివారంనాడు గుండ్లపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. డబుల్ రోడ్డు నిర్మాణం కోసం యువజన సంఘాలు ఎమ్మెల్యే కారు పై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు యువజన సంఘాలపై లాఠీచార్జీకి దిగారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
గన్నేరువరం నుండి గుండ్లపల్లికి డబుల్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతూ యువజన సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఆందోళనలకు కాంగ్రెస్ నేత కవ్వంపల్లి సత్యనారాయణ మద్దతు ప్రకటించారు.అదే సమయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అదే మార్గంలో వెళ్తున్న మానకొండూరు రసమయి బాలకిషన్ ను యువజనసంఘాలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆయన కారుపై దాడికి యత్నించార. ఈ దాడిని పోలీసులు అడ్డుకున్నారు. యువజన సంఘాల కార్యకర్తలపై పోలీసులు లాంఠీరాజ్ీ చేశారు.ఎమ్మెల్యే కారును అక్కడి నుండి సురక్షితంగా పంపించారు.గతంలో కూడ గన్నేరువరం మండలం అభివృద్దికి నోచుకోలేదని స్థానికులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. ఇవాళ పోలీసుల లాఠీచార్జీలో కొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.