హైద్రాబాద్‌ రియల్‌ఏస్టేట్ సంస్థల్లో భారీగా నగదు స్వాధీనం: ఐటీ శాఖ

Published : Jan 10, 2022, 07:50 PM ISTUpdated : Jan 10, 2022, 07:53 PM IST
హైద్రాబాద్‌ రియల్‌ఏస్టేట్ సంస్థల్లో భారీగా నగదు స్వాధీనం: ఐటీ శాఖ

సారాంశం

హైద్రాబాద్ కేంద్రంగా  కార్యకలాపాలు నిర్వహించిన మూడు రియల్ ఏస్టేట్ సంస్థల్లో రూ.800 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ సంస్థల నుండి రూ.1.64 కోట్ల నగదును సీజ్ చేశారు.

హైదరాబాద్: Hyderabad కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించిన మూడు Real Estate సంస్థల్లో భారీగా నగదును ఆదాయపన్నుశాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు.హైద్రాబాద్‌లోని మూడు రియల్ ఏస్టేట్ సంస్థల్లో నాలుగు రోజలు పాటు సోదాలు నిర్వహించారు. ఈ రియల్ ఏస్టేట్ సంస్థల్లో  రూ.800 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా  income tax గుర్తించారు. 

నగరంలోని Navya డెవలపర్స్, రాఘమయూరి ఇన్‌ఫ్రా, స్కంధాన్షీ రియల్ ఏస్టేట్ సంస్థలపై  ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మూడు సంస్థలు సుమారు రూ. 800 కోట్ల నగదు లావాదేవీలు జరిగినట్టుగా సమాచారం. ఈ సంస్థల నుండి  సుమారు రూ. 1.64 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు.

ఆదాయ పన్ను శాఖాధికారులకు చిక్కకుండా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ తయారు చేసుకొని నగదు లావాదేవీలు జరిపినట్టుగా ఐటీ శాఖాదికారులు గుర్తించారు. ఈ సాఫ్ట్ వేర్ ను కూడా రియల్ ఏస్టేట్ సంస్థ ప్రతినిధులు ధ్వంసం చేశారు. భూములను కొనుగోలు చేసిన సమయంలో నగదును Banks ద్వారా చేయకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు. హైద్రాబాద్, అనంతపూర్, కర్నూల్, వైజాగ్ , కడప, నంద్యాల, బళ్లారిలో సోదాలు నిర్వహించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం
Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!