రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో ట్విస్ట్: తల్లి, సోదరి అరెస్ట్

Published : Jan 10, 2022, 06:49 PM ISTUpdated : Jan 10, 2022, 07:30 PM IST
రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో ట్విస్ట్: తల్లి, సోదరి అరెస్ట్

సారాంశం

ఖమ్మం జిల్లాలోని పాల్వంచ పాత బజారులో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రామకృష్ణ తల్లి, సోదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.  

 ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  palwancha పాత బజారులో రామకృష్ణ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. Ramakrishna కుటుంబం ఆత్మహత్య కేసులో  రామకృష్ణ తల్లితో పాటు ఆయన సోదరిని సోమవారం నాడు  పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరిని కోర్టులో హాజరు పర్చగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

ఈ నెల 3వ తేదీన రామకృష్ణ తన భార్య శ్రీలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు సాహితీ, సాహిత్యలతో కలిసి ఆత్మహత్య చేసుకొన్నాడు. కుటుంబానికి చెందిన ఆస్తి వివాదం పరిష్కారం కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే vanama raghavendra rao తనయుడు vanama raghavendra rao  వద్దకు వెళ్లారు. అయితే  వనమా రాఘవేందర్ రావు ఈ సమస్య పరిష్కరించాలంటే రామకృష్ణ భార్య శ్రీలక్ష్మిని తన వద్దకు పంపాలని ఆర్ధర్ వేశాడు.  ఈ విషయమై  తీవ్ర మనోవేదనకు గురైన  రామకృష్ణ తన  కుటుంబంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకొనే ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. మరో వైపు suicide లేఖలో  కూడా వనమా రాఘవేందర్ రావు పేరుతో పాటు తన తల్లి, సోదరి పేర్లను కూడా రామకృష్ణ రాశాడు.

తాము ఆత్మహత్య చేసుకోవడానికి  తన సోదరి లీలా మాధవి, తల్లి సూర్యవతి లు కూడా కారణమని రామకృష్ణ ఆరోపించారు. రామకృష్ణ సెల్పీ వీడియో ప్రస్తుతం పెద్ద ఎత్తున కలకలం రేపింది. 

రామకృష్ణ సూసైడ్ లెటర్, సెల్ఫీ వీడియో ఆధారంగా తల్లి, సోదరిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.  వీరిద్దరికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు.ఈ కేసులో ప్రధానంగా వనమా రాఘవేందర్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని రామకృష్ణ తన సెల్పీ వీడియోలో పేర్కొన్నారు.

రామకృష్ణ ఆత్మహత్య చేసుకొన్న రోజు నుండి వనమా రాఘవేందర్ ఊరు వదిలి వెళ్లి పోయాడు. రాఘవేందర్ ను ఈ నెల 7న పోలీసులు అరెస్ట్ చేశారు. టీఆర్ఎస్ నుండి వనమా రాఘవేందర్ ను సస్పెండ్ చేశారు.  టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసిన తర్వాతే పోలీసులు రాఘవేందర్ ను అరెస్ట్ చేశారు. 

రామకృష్ణ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత వనమా రాఘవేందర్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలో  బయటకు రాని వారు కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. గతంలో పోలీసులను ఆశ్రయించి కూడా న్యాయం జరగని వారు మరోసారి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

వనమా రాఘవేందర్ బాధితులకు అండగా ఉంటామని కాంగ్రెస్ ప్రకటించింది. రాఘవేందర్ తండ్రి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వనమా రాఘవేందర్ ను నియోజకవర్గంతో పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతానని ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ప్రజలకు హామీ ఇచ్చారు. వనమా రాఘవేందర్ రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. వనమా రాఘవేందర్ పై 12 కేసులు నమోదైనట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.  ఓ కేసులో ముందస్తు బెయిల్ పై వనమా రాఘవేందర్  ఉన్నాడని కూడా ఆ రిపోండ్ రిపోర్టులో పోలీసులు కోర్టుకు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం