వైసీపీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు: అయోధ్య రాంరెడ్డి సంస్థల్లో 15 చోట్ల తనిఖీలు

Published : Jul 06, 2021, 12:03 PM ISTUpdated : Jul 06, 2021, 12:15 PM IST
వైసీపీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు:  అయోధ్య రాంరెడ్డి సంస్థల్లో 15 చోట్ల తనిఖీలు

సారాంశం

వైసీపీకి చెందిన ఎంపీ  అయోధ్య రాంరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు మంగళవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. రాంకీ సంస్థల అధినేతగా ఆయన కొనసాగుతున్నారు. 

హైదరాబాద్: వైసీపీకి చెందిన ఎంపీ  అయోధ్య రాంరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు మంగళవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. రాంకీ సంస్థల అధినేతగా ఆయన కొనసాగుతున్నారు. హైద్రాబాద్ మాదాపూర్ లోని రాంకీ ప్రధాన కార్యాలయంతో పాటు  హైద్రాబాద్ లోని 15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.రాంకీ సంస్థలతో పాటు రాంకీకి  అనుబంధంగా ఉన్న సంస్థల్లో కూడ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు ప్రాజెక్టులను రాంకీ సంస్థ నిర్వహిస్తోంది. మంగళవారం నాడు ఉదయం నుండి రాంకీ సంస్థల కార్యాలయాలతో పాటు ఆయన ఇంట్లో కూడ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకొన్నారని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు
IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ