రేపు రేవంత్ ప్రమాణ స్వీకారం.. 5వేల బైక్ లతో భారీ ర్యాలీ...

Published : Jul 06, 2021, 11:27 AM IST
రేపు రేవంత్ ప్రమాణ స్వీకారం.. 5వేల బైక్ లతో భారీ ర్యాలీ...

సారాంశం

ఈ నెల 7న గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా నియోజకవర్గం నుంచి ఐదువేల బైక్ లతో భారీ ర్యాలీగా తరలివెళ్లనున్నట్లు ఎల్ బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి మల్ రెడ్డి రాంరెడ్డి తెలిపారు.

హస్తినాపురం డివిజన్ టీకేఆర్ రోడ్ లోని వీఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి డివిజన్ నుంచి 5వందల మంది బైక్ లతో బుధవారం ఉదయం 9 గంటలకు చైతన్యపురి పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని, అక్కడి నుంచి ర్యాలీతో పెద్దమ్మ గుడికి చేరుకోనున్నట్లు చెప్పారు. 

ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల జితేందర్, లింగోజిగూడ డివిజన్ కార్పొరేటర్  దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుజాత, ఆయా డివిజన్‌ల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

Mangli Controversy: వీడు మామూలోడుకాదు.. మంగ్లీ కేసులో ట్విస్ట్ | Mangli Case | Asianet News Telugu
Holiday : ఈసారి లాంగ్ వీకెండ్.. వరుసగా మూడ్రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?