హైద్రాబాద్ వాసవి రియల్ ఏస్టేట్ గ్రూప్ పై ఐటీ సోదాలు: ఏక కాలంలో 10 చోట్ల సోదాలు

By narsimha lodeFirst Published Aug 17, 2022, 4:17 PM IST
Highlights

వాసవి రియల్ ఏస్టేట్ గ్రూప్ సంస్థకు చెందిన  కార్యాలయాలపై ఐటీ శాఖాధికారులు సోదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో  ఏక కాలంలో సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్: వాసవి రియల్ ఏస్టేట్ గ్రూప్ సంస్థకు చెందిన కార్యాలయాలపై ఐటీ అధికారులు బుధవారం నాడు సోదాలు చేశారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పది చోట్ల ఏక కాలంలో ఐటీ అధికారులు సోదాలు చేశారని  ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. వాసవి గ్రూప్ లోవాసవి రియాల్టీ, వాసవి నిర్మాన్, శ్రీముఖ్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్, ఇండ్మాక్స్ ఇన్  ఫ్రాస్ట్రక్చర్ సంస్థలున్నాయి. కోట్ల పనులు చేస్తూ ఐటీ చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారనే అనుమానంతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని ఈ కథనం తెలిపింది. అక్రమ  లావాదేవీలు ఏమైనా జరిగాయా అనే కోణంలో ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. 

వాసవి గ్రూప్ కంపెనీ మరో రియల్ ఏస్టేట్ కంపెనీతో కలిసి టాలెస్ట్ టవర్ పేరుతో నిర్మాణాలు చేసినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో బెంగుళూరులోని మరో రియల్ ఏస్టేట్ సంస్థపై కూడా ఐటీ అధికారులు దాడులు  సోదాలు చేస్తున్నారు. ఈ రెండు సంస్థలకు చెందిన కీలక పత్రాలను పోలీసులు సీజ్ చేసినట్టుగా ఈ కథనం తెలిపింది.

60 అంతస్థులతో భారీ నిర్మాణాన్ని  చేయాలని తలపెట్టారని  సమాచారం. ఈ రెండు కంపెనీలకు సంబంధించిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బెంంగుళూరుకు చెందిన కంపెనీల్లో 20 చోట్ల, వాసవికి చెందిన కార్యాలయాల్లో 10 చోట్ల సోదాలు చేస్తున్నారు.

 

click me!