క్రిమినల్ కేసులు లేవు: ఎన్నికల అఫిడవిట్‌లో దుబ్బాకలో టీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్ధి సుజాత

Published : Oct 15, 2020, 10:10 AM IST
క్రిమినల్ కేసులు లేవు: ఎన్నికల అఫిడవిట్‌లో దుబ్బాకలో టీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్ధి సుజాత

సారాంశం

తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సోలిపేట సుజాత ప్రకటించారు.


దుబ్బాక:తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సోలిపేట సుజాత ప్రకటించారు.

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఈ స్థానానికి నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన  సోలిపేట  సుజాత నామినేషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు.

తనకు ఎలాంటి ఆదాయం లేదని ఆమె ఆ అఫిడవిట్ లో ప్రకటించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి తన భర్త సోలిపేట రామలింగారెడ్డి 1.36 లక్షల ఆదాయ పన్నును చెల్లించినట్టుగా ఆమె ప్రకటించారు.

also read:దుబ్బాక బైపోల్: గెలుపు ఓటములు నిర్ణయించేది వీరే.

బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు కూడ ఎన్నికల అఫిడవిట్ లో పలు అంశాలను ప్రస్తావించారు. తనపై నమోదైన క్రిమినల్ కేసులను ఆయన ప్రకటించారు. కానీ ఏ కేసులో కూడ  దోషిగా  నిర్ధారించలేదని ఆయన   ప్రకటించారు.

తనపై నగదు సరఫరా, రేప్, ఆదాయ పన్ను కేసులు, ఆర్టీసీ సమ్మె సమయంలో కేసులు నమోదైనట్టుగా ఆయన తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్