తెలంగాణలో కరోనా తగ్గుముఖం... తాజా కేసులెన్నంటే

By Arun Kumar PFirst Published Oct 15, 2020, 9:11 AM IST
Highlights

తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతున్న సమయంలో కరోనా కేసుల సంఖ్య తగ్గడం కాస్త ఊరటనిస్తోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,895 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,432 మందికి పాజిటివ్ గా తేలినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదయిరన మొత్తం కేసుల సంఖ్య 2,17,679కి చేరుకోగా మొత్తం టెస్టుల సంఖ్య 37,03,047కి చేరుకుంది. 

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారిలో 1,949మంది కోలుకున్నారు.  దీంతో మొత్తంగా ఈ మహమ్మారి బారినుండి సురక్షితంగా బయటపడ్డ వారి సంఖ్య 1,93,218కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 88.76శాతంగా వుంటే ఇది దేశంలో 87.3శాతంగా వుంది. 

read more  టిటిడిలో కరోనా కలవరం... అధ్యక్షుడు వై.వి సుబ్బారెడ్డికి పాజిటివ్

ఈ మహమ్మారి బారినుండి తప్పించుకోలేక  తాజాగా 8మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1249కి చేరింది. రాష్ట్రంలో మరణాలు రేటు 0.5శాతంగా వుంటే దేశంలో మాత్రం 1.5శాతంగా వుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 23,203మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

జిల్లాల వారిగా చూసుకుంటే అత్యధికంగా జిహెచ్ఎంసీ(హైదరాబాద్)లో 244కేసులు నమోదయ్యాయి.  భద్రాద్రి కొత్తగూడెం 99, ఖమ్మం 91, మేడ్చల్ 115, నల్గొండ 74, రంగారెడ్డి 88, సూర్యాపేట 53 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో కేసుల సంఖ్య తక్కువగా వుంది.


 

click me!