తెలంగాణకు వర్ష సూచన.. పెరుగుతున్న చలి తీవ్రత.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్..

By Sumanth KanukulaFirst Published Jan 23, 2022, 9:38 AM IST
Highlights

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొంది. వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని తెలిపింది. 

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లిపోయాయని పేర్కొంది. వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇదిలా ఉంటే.. Telanganaలో గత కొద్ది రోజులు చలి తీవ్రత తగ్గుముఖం పట్టినట్టే కనిపించినా.. మరోసారి రాష్ట్రంలో నిన్నటి నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాత్రివేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఉదయం పూట పలు ప్రాంతాల్లో పొగ మంచు కురుస్తుంది. గాలిలో తేమ సాధారణం కంటే 17 శాతం అధికంగా ఉంది. చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో జనాలు ఉదయం పూట ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. Hyderabad నగరంతో పాటు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. మరికొన్ని రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. 

మరోవైపు రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో అత్యల్పంగా 10.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా  12.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో రాత్రిపూట కనిష్ట స్థాయికి పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీచేసింది. 

click me!