కోకాపేటలో నగ్నంగా మహిళ మృతదేహం.. హత్యకు ఆ రిలేషనే కారణం..!

Published : Jan 11, 2022, 11:11 AM IST
కోకాపేటలో నగ్నంగా మహిళ మృతదేహం.. హత్యకు ఆ రిలేషనే కారణం..!

సారాంశం

హైదరాబాద్‌‌ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కోకాపేటలో (Kokapeta) మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా ఆ కేసును చేధించారు. 

హైదరాబాద్‌‌ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కోకాపేటలో (Kokapeta) మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.  నిర్మానుష్య ప్రాంతంలో నగ్నంగా ఉన్న మహిళ మృతదేహం గుర్తించిన స్థానికులు.. నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. తాజాగా ఆ కేసును చేధించారు. మృతురాలి వివరాలతో పాటుగా.. ఆమెను హత్య చేసిన నిందితుడిని కూడా పోలీసులు గుర్తించారు. మృతురాలు బాలమణి.. హెరిటేజ్ ఫ్రెష్‌లో సేల్స్‌ ఉమెన్‌గా సేల్స్ ఉమోన్‌గా పనిచేస్తోంది. 

ఆమెకు కందుకూరుకు చెందిన పరమేశ్వర్‌తో పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే కొంతకాలంగా బాలమణి మరో వ్యక్తి చనువుగా ఉండటం ప్రాంరభించింది. అయితే దీనిని భరించలేక పరమేశ్వర్.. బాలమణిని హత్య చేశాడని పోలీసులు నిర్దారణకు వచ్చారు.  

ఇక, కోకాపేట సెవెన్‌హిల్స్‌ ప్రాంతం వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. క్లూస్‌ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. మహిళను అత్యాచారం చేసిన హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. వారం, పది రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావించారు. 

అంతేకాకుండా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలించారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా పలు పోలీస్ స్టేషన్‌లలో నమోదైన మిస్సింగ్ కేసులకు సంబంధించి వివరాల ఆధారంగా కూడా విచారణ సాగించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu