తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా: హోంఐసోలేషన్ లో మంత్రి

Published : Jan 11, 2022, 10:25 AM ISTUpdated : Jan 11, 2022, 05:11 PM IST
తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా: హోంఐసోలేషన్ లో మంత్రి

సారాంశం

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. తనను ఇటీవల కాలంలో కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి Jagadish Reddyకి కరోనా సోకింది. మంత్రి  హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. తనను ఇటీవల కలిసిన వారంతా corona పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు. మంత్రి జగదీష్ రెడ్డి హొం ఐసోలేషన్ లో చికిత్స తీసకొంటున్నారు. 

రెండు రోజుల క్రితం మంత్రి జగదీష్ రెడ్డి హైద్రాబాద్ ప్రెస్‌క్లబ్ లో డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో  పలువురు జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగిన రెండు రోజులకే కరోనా సోకిందని మంత్రి ప్రకటించారు.  దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసకొంటుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు తీసుకొంటుంది. కరోనాపై సీఎం కేసీఆర్ ఇటీవలనే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి..ఒమిక్రాన్ కేసులు ఐదు వేలకు చేరువలో ఉన్నాయి. 

భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,68,063 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్‌తో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,58,75,790కి చేరింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. అయితే తాజాగా నమోదైన కేసులు కిందటి రోజు నమోదైన కేసుల సంఖ్య కంటే 6.5 శాతం తక్కువగా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో కరోనాతో 277 మంది మృతిచెందారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ నేపథ్యంలో  కరోనా కేసులు పెరుగుతున్నాయి

దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,84,213కి చేరింది. తాజాగా కరోనా నుంచి 69,959 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 3,45,70,131కి చేరింది. ప్రస్తుతం దేశంలో 8,21,446 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా రోజువారి పాటిజివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. 

కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 33,470, పశ్చిమ బెంగాల్‌లో 19,286, ఢిల్లీలో 19,166, తమిళనాడులో 13,990, కర్ణాటకలో 11,698 కేసులు నమోదయ్యాయి. ఇక, దేశంలో నిన్న 15,79,928 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటివరకు భారత్‌లో మొత్తంగా 69,31,55,280 శాంపిల్స్‌కు పరీక్షించినట్టుగా పేర్కొంది. 

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. దేశంలో నిన్న 92,07,700 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,52,89,70,294కు చేరింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లు కూడా కరోనా బారినపడ్డారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కరోనా నుండి కోలుకొన్నారు.దీంతో రాష్ట్రాలకు కేంద్రం పలు మార్గదర్శకాలను వెల్లడించింది. కరోనా కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు తీసకోవాల్సిన చర్యలపై కేంద్రం రాష్ట్రాలకు ముందు జాగ్రత్తలను తెలిపింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu