భరించలేని తలనొప్పి, వాంతులతో యువతి అనుమానాస్పద మృతి..

Published : Aug 02, 2022, 02:11 PM IST
భరించలేని తలనొప్పి, వాంతులతో యువతి అనుమానాస్పద మృతి..

సారాంశం

భరించలేని తలనొప్పితో అనుమానాస్పదస్థితిలో ఓ యువతి మ మృతి చెందింది. ఈ మరణం మిస్టరీగా మారింది. 

హైదరాబాద్ : ఐసీఐసీఐ బ్యాంకులో పనిచేస్తున్న ఓ యువతి తలనొప్పి భరించలేక మరణించిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసింది. నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కింగ్ కోటి ప్రాంతంలో సోమవారం సాయంత్రం జరిగింది ఈ ఘటన. ఇన్ స్పెక్టర్ రాపోలు శ్రీనివాస్ రెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 

నిజామాబాద్ జిల్లా పెద్ద భీంగల్ గ్రామానికి చెందిన కొత్తపల్లి అనూష్ (22) నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చింది. అబిడ్స్ లోని ఐసీఐసీఐ బ్యాంకులో క్యాషియర్ గా పనిచేస్తూ కింగ్ కోఠి షేర్ గేట్ దగ్గర ఉన్న సింధూజ హాస్టల్లో నివాసం ఉంటోంది. సోమవారం తన స్నేహితురాలితో కలిసి డ్యూటీకి వెళ్లింది. అప్పటికే తలనొప్పి, వికారంగా ఉండటంతో ఆఫీస్ కు వెళ్లిన గంటకు వాంతులు చేసుకుంది. వెంటనే తాను పనిచేయలేనని మేనేజర్ పర్మిషన్ తీసుకుని హాస్టల్ కు వచ్చింది. కొద్ది సేపటికే తలనొప్పి ఎక్కువ కావడంతో పక్క రూంమేట్ ఒకామెను జండూబామ్ రాసి తలకు మసాజ్ చేసింది. 

చేరికల కమిటీ చైర్మన్ కాదు.. బ్రోకర్ల కమిటీ చైర్మన్.. ఈటెలపై పాడి కౌశిక్ ధ్వజం

అయినా సాయంత్రం 4 గంటల సమయంలో తీవ్ర తలనొప్పి, ఒళ్లంతా చెమటలు పట్టి, కనుగుడ్లు తేలేస్తుండడంతో ఆందోళన చెందిన స్నేహితులు అనూషను ఆసుపత్రికి తీసుకెడుతున్న క్రమంలో మరోసారి వాంతి చేసుకుంది. ఆటోలో ఎక్కించాక నోటినుంచి నురగ వచ్చింది. ఆ తరువాత అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. సమీపంలోకి కింగ్ కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?