కేసీనో వ్యాపారం నిర్వహిస్తున్న చీకోటి ప్రవీణ్ మంగళవారం నాడు ఈడీ విచారణకు హాజరయ్యారు. నిన్న 11 గంటల పాటు ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారించారు.
హైదరాబాద్: Casino వ్యాపారం నిర్వహిస్తున్న Chikoti Praveen మంగళవారం నాడు Enforcement Directorate విచారణకు రెండో రోజూ కూడా హాజరయ్యారు. బ్యాంకు స్టేట్ మెంట్ తో ప్రవీణ్ విచారణకు వచ్చారు. నిన్న 11గంటల పాటు ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారించారు.
గత మాసంలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సుమారు 20 గంటల పాటు సోదాలు నిర్వహించారు.ఈ సోదాలు నిర్వహించిన సమయంలో లాప్ టాప్, మొబైల్స్ సహా కొంత కీలక సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు.ఈ సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రవీణ్ ను విచారిస్తున్నారు.
undefined
also read:నిన్న 11 గంటల విచారణ: నేడు కూడా చీకోటి ప్రవీణ్ ను విచారించనున్న ఈడీ
చట్టబద్దంగా కేసీనో వ్యాపారం చేసుకోవచ్చో అక్కడే ఈ వ్యాపారం తాను చేసినట్టుగా ప్రవీణ్ ప్రకటించారు. హవాలా మార్గంలో ప్రవీణ్ డబ్బులు తరలించినట్టుగా ఈడీ అధికారుల అనుమానిస్తున్నారని ప్రముఖ టీవీ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.దాదాపుగా ఏడు మాసాల్లో ప్రవీణ్ ఏదు దేశాల్లో కేసీనో నిర్వహించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించినట్టుగా ఈ కథనం తెలిపింది. విదేశాలకు కేసినో ఆడేందుకు వెళ్లిన వారికి టోకెన్ విధానం చీకోటి ప్రవీణ్ అమలు చేశారని ఈడీ అధికారులు గుర్తించారని ఈ కథనం తెలిపింది. కేసినోలో గెలుచుకున్న ప్రైజ్ మనీని గెలుచుకున్న వారికి కూడా టోకెన్ ను ఇచ్చేవారన్నారు. హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత టోకెన్ ఇచ్చి డబ్బులు తీసుకొనేవారని ఈడీ అధికారులు గుర్తించారని ఈ కథనం తెలిపింది.
చీకోటి ప్రవీణ్ కు రాజకీయ ప్రముఖులు, సినీ తారలతో కూడా సంబంధాలున్నాయని కూడా ఈడీ అధికారులు గుర్తించారు. బిగ్ డాడీ అడ్డా కోసం సినీ తారలతో ప్రమోషన్ చేయించాడు.ఈ ప్రమోషన్ విషయమై సినీ తారలకు ప్రవీణ్ ఇచ్చిన డబ్బుల వ్యవహరం గురించి కూడా ఈడీ అదికారులు ఆరా తీస్తున్నారు.
నా పేరుతో ట్విట్టర్ అకౌంట్లు ఫేక్
తన పేరుతో వచ్చిన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లు నకిలీవని చీకోటి ప్రవీణ్ చెప్పారు.ఈ విషయమై ఇవాళ తాన సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఆయన వివరించారు. ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు..నకిలీ సోషల్ మీడియా ఖాతాలు ఎవరు సృష్టించారో తనకు తెలియదన్నారు. ఈ విషయమై విచారణ జరిపించాలని ఆయన పోలీసులను కోరారు.
మరో వైపు ఈడీ విచారణకు సంబంధించి వాస్తవాలు రాయాలని కూడా ఆయన మీడియాను కోరారు. అతిగా ఊహించుకొని మీడియాలో కథనాలు ప్రసారం చేయడం వల్ల మీకు వచ్చే లాభం కూడా లేదని ఆయన మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు. పలు మీడియా సంస్థలు పలు రకాలైన కథనాలు ప్రసారం చేస్తున్నాయన్నారు. అసలు వాస్తవాలు ఏమిటో మీరే తేల్చుకోవాలన్నారు. ఏది వాస్తవమో కూడా తేల్చుకోలేకపోతున్నారు.. వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని ఆయన మీడియాను కోరారు.వాస్తవాలు ప్రసారం చేస్తేనే ప్రజలు నమ్ముతారన్నారు. అతిగా ఊహించుకొని తనను డీఫేమ్ చేయడం ద్వారా ఏముస్తుందని కూడా ఆయన మీడియాను ప్రశ్నించారు. కేసినో కు సంబంధించి తాను త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తానని కూడా ఆయన వివరించారు.