సమ్మెపై తాడోపేడో: ఆర్టీసీ జేఎసీతో నేడు ఐఎఎస్ కమిటీ కీలక చర్చలు

Published : Oct 04, 2019, 12:00 PM ISTUpdated : Oct 05, 2019, 03:13 PM IST
సమ్మెపై తాడోపేడో: ఆర్టీసీ జేఎసీతో నేడు ఐఎఎస్ కమిటీ కీలక చర్చలు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో  ఆర్టీసీ సమ్మెపై శుక్రవారం నాడు స్పష్టత రానుంది. జేఎసీ నేతలతో  ప్రభుత్వం చర్చించనుంది.ఈ చర్చలు విఫలమైతే సమ్మెకు దిగుతామని జేఎసీ ఇదివరకే ప్రకటించింది.


హైదరాబాద్: ఆర్టీసీ జేఎసీ నేతలతో శుక్రవారం నాడు ఐఎఎస్ అధికారుల కమిటీ చర్చించనుంది. గురువారం నాడు సాయంత్రం జరిగిన చర్చలు విఫలయం కావడంతో శుక్రవారం నాడు చర్చించనున్నారు.

ఈ నెల 5వ తేదీ ఉదయం నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నట్టు  ప్రకటించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 26 డిమాండ్లపై ఆర్టీసీ జేఎసి నేతలు చర్చలు జరుపుతున్నారు.

ఆర్టీసీ జేఎసీ నేతలతో ఐఎఎస్ అధికారుల కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చివరగా శుక్రవారం నాడు మరోసారి ఆర్టీసీ జేఎసీ నేతలతో ఐఎఎస్ అధికారుల కమిటీ చర్చించనుంది.చర్చలు మరోసారి విఫలమైతే సమ్మె అనివార్యం కానుంది.

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే ప్రత్యామ్యాయ చర్యలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ మేరకు ఆర్టీఏ, రవాణా శాఖాధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.ఆర్టీసీలోని అద్దె బస్సులను నడపనున్నారు. 

అంతేకాదు ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లను కూడ ఉపయోగించుకోనున్నారు. ప్రైవేట్ వ్యక్తులను డ్రైవర్లు, కండక్టర్లుగా సేవలను వినియోగించుకోనున్నారు. సమ్మెకు వెళ్తే  కఠిన చర్యలు తప్పవని కూడ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే  ఇవాళ ఆర్టీసీ జేఎసీతో చర్చలు కీలకం కానున్నాయి.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu