ఐదు నిమిషాల్లో చనిపోతున్నా.. రావొద్దు: శ్రీశైలం అగ్ని ప్రమాదంలో ఏఈ మోహన్

Published : Aug 21, 2020, 04:24 PM IST
ఐదు నిమిషాల్లో చనిపోతున్నా.. రావొద్దు: శ్రీశైలం అగ్ని ప్రమాదంలో  ఏఈ మోహన్

సారాంశం

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తాము చనిపోతున్నామని తెలుసుకొని ఇతరులనైనా కాపాడేందుకు ప్రయత్నించారు. పవర్ ప్లాంట్ ను కూడ ఈ ప్రమాదం నుండి రక్షించేందుకు ప్రయత్నించారు. చివరి నిమిషంలో కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు.


శ్రీశైలం: శ్రీశైలం పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తాము చనిపోతున్నామని తెలుసుకొని ఇతరులనైనా కాపాడేందుకు ప్రయత్నించారు. పవర్ ప్లాంట్ ను కూడ ఈ ప్రమాదం నుండి రక్షించేందుకు ప్రయత్నించారు. చివరి నిమిషంలో కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడారు.

also read:శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం

శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన సమయంలో మంటలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఏఈ మోహన్ ప్రయత్నించాడు. తన వద్దకు ఎవరూ రావొద్దని ఆయన కోరారు. అగ్ని ప్రమాదం విషయమై మరో ఏఈ అనిల్ కు సమాచారం ఇచ్చాడు.

మంటలు తీవ్రంగా ఉన్నాయని ఆయన అనిల్ కు చెప్పారు. మిగిలినవారంతా అప్రమత్తంగా ఉండి ప్లాంట్ నుండి బయటపడాలని సూచించారు. మరో 5 నిమిషాల్లో చనిపోతున్నానని అనిల్ కు ఏఈ మోహన్ చెప్పాడు.

మంటలను తగ్గించే క్రమంలో అక్కడే మోహన్ మంటల్లోనే కాలిపోయాడు. మరో వైపు ఉజ్మ ఫాతిమా పవర్ ప్లాంట్ ద్వారం వద్దకు వచ్చింది. అయితే అమరన్ కంపెనీ నుండి ఇద్దరు ఉద్యోగులు బ్యాటరీలు బిగించేందుకు పవర్ ప్లాంట్ వద్దకు వచ్చారు. 

వీరిద్దరికి ఈ ప్రాంతానికి కొత్తవారు. ఫాతిమా డోర్ వద్దకు వచ్చి మళ్లీ వెనక్కు వెళ్లింది. అమరన్ కంపెనీ నుండి వచ్చిన ఇద్దరిని బయటకు పంపే ప్రయత్నం చేసింది.ఈ క్రమంలోనే ఉజ్మా ఫాతిమా కూడ ఈ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తోంది. 

ఏఈ మోహన్ తో పాటు మరికొందరు అధికారులు ల్యాండ్ లైన్ ద్వారా చివరి నిమిషంలో తమ కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడారు. అగ్ని ప్రమాదం గురించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. 15 నిమిషాల్లో బయటకు రాకపోతే చనిపోతామని కూడ కుటుంబసభ్యులకు చెప్పారు. పిల్లల్ని బాగా చదివించాలని కొందరు తమ ప్యామిలీ సభ్యులకు చెప్పారు.

పవర్ ప్లాంట్ లో ఏదైనా ప్రమాదం జరిగితే రెండు మార్గాల ద్వారా బయటకు రావొచ్చు.  ఇంగ్లాండ్ టన్నెల్ , ఏస్కేప్ చానెల్  నుండి బయటకు రావొచ్చు. అయితే ఈ రెండు ప్రాంతాల నుండి భారీగా పొగ వస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.