మానవత్వమే పరమావధి... సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే తీరిది!! డిజిపి ప్రశంసలు...

By telugu teamFirst Published Aug 21, 2020, 4:11 PM IST
Highlights

గత నెలలో కూడా తల్లిందండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు పోలీస్ శాఖ తరపున అండగా ఉంటూ తానే స్వయంగా ఆ అనాథ పిల్లల కోసం ఇల్లు కట్టించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు. ఆ విషయం తెలిసిన తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే ని అభినందించారు.

రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే ఎవరికైనా ఆపద వస్తే సహాయం చేయటంలో ముందుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే బ్రాండ్ కి సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే చేస్తున్న పనులతో ప్రజల్లో పోలీసుల పట్ల ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కరోనా నేపథ్యంలో గత 4 నెలలుగా పేదలకు ఎంతో తోడ్పాటును అందిస్తూ వచ్చిన ఎస్పీ జిల్లా వ్యాప్తంగా ఎందరికో నిత్యావసర వస్తువులను అందిస్తూ వార్తల్లో నిలిచారు. గత నెలలో కూడా తల్లిందండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలకు పోలీస్ శాఖ తరపున అండగా ఉంటూ తానే స్వయంగా ఆ అనాథ పిల్లల కోసం ఇల్లు కట్టించి తన గొప్పతనాన్ని చాటుకున్నారు.

ఆ విషయం తెలిసిన తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే ని అభినందించారు. ఏది ఏమైనా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. తన సిబ్బందికి కూడా కొన్ని విషయాల్లో తర్ఫీదునిస్తూ ప్రజలకు ఏ ఆపద వచ్చిన తామున్నామనే భరోసా ఇస్తూ ప్రజలకు పోలీసులకు మధ్య మంచి సంబంధాలు ఏర్పడేలా రాజన్న సిరిసిల్ల పోలీసులు కృషి చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా మరోసారి ఎస్పీ రాహుల్ హెగ్డే తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక పసిబిడ్డను ఆదుకొని తానే స్వయంగా యాభై వేల రూపాయాల సహాయాన్ని అందజేసి ఆ చిన్నారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. విషయాలోకి వెళ్తే సిరిసిల్ల జిల్లా కొండాపూర్ గ్రామంలోని ఒక పేద కుటుంబానికి చెందిన తాటిపల్లి భానుచందర్, దివ్యలకు 8 వ నెలలోనే పాప పుట్టింది పుట్టిన వెంటనే పాప ఆరోగ్యం బాలేకపోవటంతో కరీంనగర్ లోని ఒక హాస్పిటల్ లో సంప్రదించగా పాప చికిత్స విషయమై 3 నుండి 4 లక్షలు ఖర్చు అవుతుందని అక్కడి వైద్యులు చెప్పగా ఆ పాప తల్లిందండ్రులు దిక్కుతోచనిస్థితిలో ఉండిపోయారు.

విషయం తెలుసుకున్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ వెంటనే ఆ పాప తల్లిదండ్రులను ఎస్పీ కార్యాలయానికి పిలిపించుకొని తక్షణ సహాయం కింద యాభై వేల రుపాయలను అందజేసి వెంటనే ఆసుపత్రిలో చేరే విధంగా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు మిగతా డబ్బుల గురించి కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దని తామే ఏర్పాటు చేస్తామని వారికి ధైర్యం నింపారు. రాహుల్ హెగ్డే చేస్తున్న సహాయ కార్యక్రమాల పట్ల డిజిపి మహేందర్ రెడ్డి కూడా స్వయంగా ఫోన్ చేసి అభినదించటం గమనార్హం. ఏదిఏమైనా ఇలాంటి పోలీసులతో పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో సముచితమైన అభిప్రాయం ఏర్పడటంతో పాటు ప్రజల్లో గౌరవం పెంపొందుతుంది.

click me!