శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం

Published : Aug 21, 2020, 03:39 PM IST
శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం: సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం

సారాంశం

శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సిఐడి విచారణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు  ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని ఆయన కోరారు.

హైదరాబాద్: శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సిఐడి విచారణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు  ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని ఆయన కోరారు.

 ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఐడి అడిషనల్ డి.జి.పి. గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 

also read:శ్రీశైలం పవర్ హౌస్ లో అగ్ని ప్రమాదం: ఆరు డెడ్‌బాడీల వెలికితీత

ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. శ్రీశైలం పవర్ ప్లాంట్ లో గురువారం నాడు అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో 9 మంది చిక్కుకొన్నారు. ఇప్పటికే ఆరు మృతదేహాలను గుర్తించారు. మరో ముగ్గురి  కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై ప్రభుత్వం విచారణ జరపనుంది. శ్రీశైలం విద్యుత్ ఫ్లాంట్ లో తొలిసారిగా ఇంత పెద్దస్థాయిలో ప్రమాదం చోటు చేసుకొంది.ీ ప్రమాదంతో విద్యుత్ ఉద్యోగుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
 

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu