సుప్రజను ఎంబీబీఎస్ చదివిస్తా: వాసాలమర్రిలో కేసీఆర్

Published : Jun 22, 2021, 04:21 PM IST
సుప్రజను ఎంబీబీఎస్ చదివిస్తా: వాసాలమర్రిలో కేసీఆర్

సారాంశం

వాసాలమర్రి గ్రామానికి చెందిన సుప్రజ అనే విద్యార్ధిని చదువుకు సహకరిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.


యాదగిరిగుట్ట: వాసాలమర్రి గ్రామానికి చెందిన సుప్రజ అనే విద్యార్ధిని చదువుకు సహకరిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు.మంగళవారం నాడు వాసాలమర్రి గ్రామస్తులతో సీఎం కేసీఆర్  సహపంక్తి భోజనం చేశారు. అనంతరం గ్రామస్తుల సమస్యలను ఆయన తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.   

also read:ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలి: కేసీఆర్

ఈ గ్రామానికి చెందిన  సుప్రజ అనే విద్యార్ధిని తన వద్దకు వచ్చి చదువుకోవాలని కోరిందన్నారు. తాను టెన్త్ పాసైనట్టుగా చెప్పారు.  తనకు ఎంబీబీఎస్ పూర్తి చేయాలని  సుప్రజ తెలిపిందని కేసీఆర్ చెప్పారు.  ఆ కుటుంబానికి ఆర్ధిక స్తోమత లేదని ఆమె పేరేంట్స్  తనకు తెలిపారన్నారు. 

సుప్రజ ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసేందుకు తాను సహకరిస్తానని ఆయన చెప్పారు. సుప్రజ లాంటి విద్యార్థులు ఎందరున్నారనే విషయమై ఆరా తీయాలన్నారు. ప్రభుత్వం నుండి కూడ అనేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడ చదువుకొనేందుకు ప్రభుత్వం నుండి సహాయ సహకరాలు అందిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ