‘లిఫ్టింగ్ ఎ రివర్’.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై డిస్కవరీ ఛానెల్ డాక్యుమెంటరీ

By Siva KodatiFirst Published Jun 22, 2021, 3:16 PM IST
Highlights

ఇంజనీరింగ్ అద్భుతంగా నీటిపారుదల నిపుణులు కొనియాడుతున్న తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాళేశ్వరం గొప్పదనం, నిర్మాణం, కాలువలు, లిఫ్ట్ ఇరిగేషన్, పంపింగ్ తదితర అంశాలపై ప్రముఖ అంతర్జాతీయ ఛానెల్ డిస్కవరీ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. 

ఇంజనీరింగ్ అద్భుతంగా నీటిపారుదల నిపుణులు కొనియాడుతున్న తెలంగాణ జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాళేశ్వరం గొప్పదనం, నిర్మాణం, కాలువలు, లిఫ్ట్ ఇరిగేషన్, పంపింగ్ తదితర అంశాలపై ప్రముఖ అంతర్జాతీయ ఛానెల్ డిస్కవరీ ఓ డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ నెల 25న రాత్రి 8 గంటలకు డిస్కవరీ తన డిస్కవరీ సైన్స్ చానెల్ లో ‘లిఫ్టింగ్ ఎ రివర్’ పేరిట ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయబోతోంది. ఈ డాక్యుమెంటరీని దాదాపు మూడేళ్ల పాటు నిర్మించారు. అందులో ప్రాజెక్టును కట్టిన తీరుతెన్నులను కళ్లకు కట్టినట్టు చూపించారు. 2017లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును కేవలం మూడేళ్లలోనే పూర్తి చేయడం విశేషం.

Also Read:కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్... ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఆ పేర్లే ఎందుకంటే

రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రీడిజైన్ చేయించారు. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్‌రావు పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో స్వల్ప కాలంలోనే భారీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ఈ డాక్యుమెంటరీని హైదరాబాద్ కు చెందిన కొండపల్లి రాజేంద్ర శ్రీవత్స నిర్మించారు. ఇప్పటికే ఆయన పలు రచనల ద్వారా అనేక అవార్డులను గెలుచుకున్నారు. ఆసియా టెలివిజన్ అవార్డు, సింగపూర్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలీ అవార్డ్స్, ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులను రాజేంద్ర సొంతం చేసుకున్నారు.

click me!