ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలి: కేసీఆర్

Published : Jun 22, 2021, 04:00 PM IST
ఏడాదిలో బంగారు వాసాలమర్రి కావాలి: కేసీఆర్

సారాంశం

ఏడాదిలో వాసాలమర్రి బంగారు వాసాలమర్రి కావాలని... ఈ దిశగా మనమంతా పట్టుదలతో పనిచేయాలని సీఎం  కేసీఆర్ కోరారు.   

యాదగిరిగుట్ట: ఏడాదిలో వాసాలమర్రి బంగారు వాసాలమర్రి కావాలని... ఈ దిశగా మనమంతా పట్టుదలతో పనిచేయాలని సీఎం  కేసీఆర్ కోరారు. మంగళవారం నాడు వాసాలమర్రి గ్రామస్తులతో సీఎం కేసీఆర్  సహపంక్తి భోజనం చేశారు. అనంతరం గ్రామస్తుల సమస్యలను ఆయన తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  వాసాలమర్రికి తాను అండగా ఉంటానని ఆయన చెప్పారు. వాసాలమర్రికి మరో 20 సార్లు వస్తానన్నారు. వాసాలమర్రిలో అభివృద్ది పనులు జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

also read:వాసాలమర్రి గ్రామస్తులతో కేసీఆర్ భోజనం: గ్రామాభివృద్దిపై చర్చ

అంకాపూర్ లో గ్రామాభివృద్ది కమిటే సుప్రీంకోర్టు అని ఆయన చెప్పారు. కొన్ని సమయాల్లో గ్రామాభివృద్ది కమిటీ సర్పంచ్ లకు జరిమానాను విధించిందని చెప్పారు. మీరు పట్టుబడితే గ్రామం అభివృద్ది చెందుతుందన్నారు. ఈ మిషన్ లో పార్టీలు, కులాల గొడవలు ఉండవద్దని ఆయన చెప్పారు. గొర్లు, బర్లు, ట్రాక్టర్లు కొనివ్వడం గొప్పపని కాదన్నారు.సీఎం మీ చేతిలో ఉన్నాడని ఆయన గుర్తు చేశారు. 1500 మంది వారానికి 2 గంటలు ఊరి కోసం పనిచేస్తే  గ్రామం మారదా అని ఆయన ప్రశ్నించారు. ఇవాళ్టి నుండి వాసాలమర్రి తన ఊరేనని సీఎం కేసీఆర్ తెలిపారు.


 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ