జగన్ ను ఒక్కసారే కలిశా, అలా చేసి ఉండకపోతే: కొండా సురేఖ

By pratap reddyFirst Published Sep 8, 2018, 1:02 PM IST
Highlights

ఏ పార్టీలో చేరినా తాము నిబద్ధతతో పనిచేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసమ్మతి నేత కొండా సురేఖ అన్నారు. తామేమీ నాలుగు పార్టీలు మారలేదని ఆమె శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. 

హైదరాబాద్‌: ఏ పార్టీలో చేరినా తాము నిబద్ధతతో పనిచేస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అసమ్మతి నేత కొండా సురేఖ అన్నారు. తామేమీ నాలుగు పార్టీలు మారలేదని ఆమె శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. 

వైఎస్సార్ కాంగ్రెసు నుంచి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఎప్పుడూ కలవలేదని, తమకు డబుల్ గేమ్ లు అలవాటు లేదని ఆమె అన్నారు. గవర్నర్ తల్లి మరణించినప్పుడు చూడడానికి వెళ్లినప్పుడు అక్కడ మాత్రమే తాను జగన్ ను కలిశానని, మరెప్పుడూ కలవలేదని అమె అన్నారు. 

జగన్ ను డీమెరిట్ చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి మోసం చేశారని ఆమె అన్నారు. తనకు కేసిఆర్ పిలిచి మరీ టికెట్ ఇచ్చారని, తాము ఏ పార్టీలోకీ వెళ్లలేదని అన్నారు. జగన్ సమైక్య నినాదం తీసుకున్నందుకే తాము వైఎస్సార్ కాంగ్రెసు నుంచి బయటకు వచ్చామని, అలా తీసుకుని ఉండకపోతే అక్కడే ఉండేవాళ్లమని, అప్పుడు ఓడిపోయినా దాన్ని అంగీకరించి ఉండేవాళ్లమని అన్నారు. 

ఏది జరిగినా తమ మంచికే జరుగుతుందని సురేఖ అన్నారు. పార్టీ నుంచి తాము చెప్పే పోతామని, దొడ్డిదారిన వెళ్లబోమని అన్నారు. ఎర్రబెల్లి కుల రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు.

భూపాలపల్లిలో తాను వెళ్తే తప్ప మధుసూదనా చారి గెలిచే పరిస్థితి లేదని, మధుసూదనాచారి కోరితే తాను వెళ్లి ప్రచారం చేశానని కొండా మురళి చెప్పారు. మధుసూదనాచారికి భూపాలపల్లిలో వ్యతిరేకత ఉందని తాను కేటీఆర్ తో చెప్పానని, ఒక వేళ మధుసూదానాచారిని మార్చదలుచుకుంటే ఆ సీటు తమకు కేటాయించాలని అడిగానని సురేఖ చెప్పారు. 

తెల్లారి నుంచి కేటీఆర్ ఫోన్ ఎత్తరు, ఆగం పట్టిస్తున్నారు: కొండా సురేఖ

బీసీ మహిళను అవమానించారు, కన్నీళ్లు పెట్టుకున్నా: కొండా సురేఖ

కాంగ్రెస్ వైపు కొండా సురేఖ: మధ్యాహ్నం ప్రెస్ మీట్

షాకింగ్ న్యూస్.. వైసీపీ నేత పెద్దారెడ్డి కి గుండెపోటు

click me!