రేవంత్ రెడ్డి ప్రత్యర్థి ప్రచారం షురూ... (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 8, 2018, 12:39 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ రద్దవడంతో ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు నియోజకవర్గాల బాట పట్టారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో అన్ని పార్టీల కంటే టీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఇప్పటికే హుస్నాబాద్ సభ ద్వారా సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. దీంతో టికెట్లు సాధించిన అభ్యర్థులు నియోజకవర్గాల బాట పట్టారు. 

తెలంగాణ లో అత్యంత ఆసక్తికరమైన పోటీ వున్న నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. ఇక్కడినుండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందాడు. అయితే ఇతడు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లతో పాటు పలువురు మంత్రులపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ రాష్ట్రంలో సంచలనం సృష్టించాడు. దీంతో ఇతడిని ఓడించడమే లక్ష్యంగా మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ నరేందన్ రెడ్డి ని రేవంత్ రెడ్డి పై పోటీకి టీఆర్ఎస్ నిలిపింది.

దీంతో పట్నం నరేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా బండ్లగూడలోని ఆరె మైసమ్మ దేవాలయం లో పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరో ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ గౌడ్ తో కలిసి పూజలు చేసిన నరేందర్ రెడ్డి ఇక్నడి  నుండి వేరుగా కొండగల్ కు వెళ్లి ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలంగాణలో దమ్మున్న పార్టీ ఏదైనా ఉందా అంటే అది టీఆర్ఎస్ మాత్రమే అని ప్రశంసించారు. కేసీఆర్ కూడా ఒకేసారి 105 మంది అభ్యర్ధులను ప్రకటించి దమ్మున్న నేతగా నిరూపించుకున్నారని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఖచ్చితంగా వంద స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. తన నియోజకవర్గంలో ప్రచారం ఎలా చేయనున్నాడో నరేందర్ రెడ్డి వివరించారు.

వీడియో

"

click me!