కారు డ్రైవర్ కేసీఆరే: సీఎం పదవిపై కేటీఆర్ వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Nov 15, 2018, 2:02 PM IST
Highlights

 తాను మంత్రిగా అవుతానని ఏనాడూ కూడ కలలో ఊహించలేదని  తెలంగాణ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్  ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలనేది  తన కోరిక అని ఆయన చెప్పారు

హైదరాబాద్: తాను మంత్రిగా అవుతానని ఏనాడూ కూడ కలలో ఊహించలేదని  తెలంగాణ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. టీఆర్ఎస్  ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలనేది  తన కోరిక అని ఆయన చెప్పారు.

గురువారం నాడు  సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.2004 తర్వాత  కేంద్ర మంత్రివర్గం నుండి టీఆర్ఎస్ వైదొలిగిన తర్వాత కరీంనగర్ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ గెలుపు అనేది ఆనాడూ  తప్పనిసరి. ఆ సమయంలో తాను బహుళ జాతి సంస్థ కంపెనీలో సౌత్ ఏషియా కంపెనీకి హెడ్‌గా పనిచేస్తున్నాను.

ఆ సమయంలో కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకపోతే  రాజకీయంగా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తాను  మూడు మాసాల పాటు  తనకు సెలవు కావాలని తమ కంపెనీని అడిగితే సెలవు ఇవ్వడానికి కంపెనీ ఒప్పుకోలేదని చెప్పారు.ఆ సమయంలో తనకు నెలకు నాలుగున్నర లక్షల జీతం ఉందన్నారు. కానీ ఆ సమయంలో  టీఆర్ఎస్ విజయం  సాధించాల్సిన అనివార్య  పరిస్థితులున్నాయి.

దీంతో  తాను ఆనాడూ  కేసీఆర్‌కు చెప్పకుండానే ఉద్యోగానికి రాజీనామా చేసి  ఉద్యోగం చేరినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే చాలు అనుకొన్నట్టుగా చెప్పారు. కార్యకర్తగా  టీఆర్ఎస్‌‌లో పనిచేశానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం సిద్ధించినట్టు చెప్పారు.  కానీ, తాను మంత్రిగా పనిచేస్తానని ఏనాడూ ఊహించలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగాలనేదే తన అభిమతమని ఆయన చెప్పారు. డిసెంబర్ 12 తర్వాత తెలంగాణ మంత్రివర్గంలో చోటు వస్తోందో రాదో తనకు తెలియదన్నారు. మంత్రి పదవి వచ్చినా రాకున్నా ఫర్వా లేదన్నారు.  సీఎం పదవిపై తనకు ఆశ లేదన్నారు.

ఎమ్మెల్యేలంతా తనను సీఎం పదవి చేపట్టాలని కోరుకొన్నా... తనకు ఆ పదవిపై ఆశ లేదని చెప్పారు. కేసీఆర్ ఆ పదవిలో ఉండాలనేది తమ అభిమతంగా ఆయన తేల్చి చెప్పారు.

 

సంబంధిత వార్తలు

హైదరాబాద్‌‌పై బాబు కామెంట్స్‌కు కేటీఆర్ కౌంటర్

హైద్రాబాద్ అభివృద్ధి నాదే, కేసీఆర్‌కు ఆ సత్తా లేదు: బాబు

click me!