ఎమ్మెల్యే అభ్యర్థి కోసం.. స్వయంగా కారు నడిపిన కవిత

Published : Nov 15, 2018, 01:56 PM IST
ఎమ్మెల్యే అభ్యర్థి కోసం.. స్వయంగా కారు నడిపిన కవిత

సారాంశం

నామినేషన్ వేయించేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా రంగంలోకి దిగారు.

నిజామాబాద్  అర్బన్ టీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా.. గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఆయన చేత నామినేషన్ వేయించేందుకు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వయంగా రంగంలోకి దిగారు.

నామినేషన్ వేయడానికి గణేష్ గుప్తా వెళ్లే వాహనాన్ని కవిత స్వయంగా నడిపారు. గులాబి రంగులోని అంబాసిడర్ కారు డ్రైవర్ సీటులో కవిత కూర్చొని.. తన పక్క సీట్లో గణేష్ గుప్తాను కూర్చోపెట్టుకున్నారు. 

అతని ఇంటి దగ్గర నుంచి మున్సిపల్ ఆఫీసు వరకు ప్రచార రథాన్ని ఆమె నడిపారు. కాగా.. ఆమె అలా వాహనం నడపడాన్ని చూసిన స్థానికులు ఆ చిత్రాన్ని తమ ఫోన్లలో  చిత్రీకరించేందుకు ఎగబడ్డారు.

మీడియా మిత్రులు సైతం.. కవిత వాహనం వెనక వస్తూ.. ఫోటోలు, వీడియోలు తీశారు. అనంతరం గణేష్ గుప్తా నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. కవిత కారు నడిపిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?