బెంగళూరులో హైదరాబాద్‌ కు చెందిన మహిళ అనుమానాస్పద మృతి..

Published : Jun 06, 2023, 11:34 AM IST
బెంగళూరులో హైదరాబాద్‌ కు చెందిన మహిళ అనుమానాస్పద మృతి..

సారాంశం

బెంగళూరులో ఉంటున్న ఓ హైదరాబాద్ యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

బెంగళూరు : హైదరాబాద్‌కు చెందిన ఆకాక్ష అనే మహిళ బెంగళూరులో అనుమానాస్పద మృతి చెందింది. నగరంలోని కోడిహళ్లిలోని జీవన్‌భీమా నగర్‌లో అనుమానాస్పద రీతిలో ఆమె మృతి చెందింది. ఆకాక్ష ఢిల్లీకి చెందిన అర్పిత్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. అతనే ఆకాక్షను ఊపిరాడకుండా చేసి.. హత్య చేసి.. గదికి తాళం వేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. గదిలోకి మరో రూమ్ మేట్ రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

నిన్న రాత్రి ఆకాక్ష, అర్పిత్‌లు గొడవపడ్డారు. తామిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆ తర్వాత అర్పిత్ ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తర్వాత ఆకాంక్ష మెడకు తాడులాంటిది బిగించి ఉరివేసుకుని చనిపోయినట్లుగా చిత్రీకరించాలని చూశాడు. రూమ్మేట్ ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. అక్కడ పరిశీలించిన తరువాత దీనిమీద కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే