ఎల్లుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపమందు పంపిణీ: ఏర్పాట్లను పరిశీలించిన తలసాని

By narsimha lode  |  First Published Jun 6, 2023, 11:30 AM IST

ఎల్లుండి  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో  చేప మందు  పంపిణీకి   ఏర్పాట్లు  చేస్తున్నారు.  ఈ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  ఇవాళ  పరిశీలించారు.


హైదరాబాద్:  మృగశిర కార్తెను పురస్కరించుకొని  ఈ నెల 8వ తేదీన  హైద్రాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో  బత్తిన హరినాథ్ గౌడ్  సోదరులు చేపమందును పంపిణీ  చేయనున్నారు.   ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు  ఏళ్ల తరబడి నుండి   బత్తిన హరినాథ్  గౌడ్  సోదరులు  చేపమందును పంపిణీ  చేస్తున్నారు. 

కరోనా  కారణంగా  మూడేళ్లపాటు  చేపమందు  పంపిణీని నిలిపివేశారు.   దేశ వ్యాప్తంగా  పలు  రాష్ట్రాల నుండి  ఉబ్బసం వ్యాధిగ్రస్తులు  చేప మందు కోసం  వేలాదిగా  తరలివస్తారు.  మూడేళ్లుగా  చేప మందు  పంపిణీ  నిర్వహించలేదు.  కరోనా  తగ్గుముఖం పట్టడంతో  ఈ ఏడాది    చేపమందు  పంపిణీని  చేపట్టనున్నారు.  ఆస్తమా రోగులకు  చేపమందును  బత్తిన హరినాథ్ గౌడ్  సోదరులు ఉచితంగా అందించనున్నారు. 24 గంటల పాటు  చేపమందును  పంపిణీ  చేస్తారు.   చేపమందు  పంపిణీ విషయమై  బత్తిన హరినాథ్ గౌడ్  సోదులు  ఇటీవలనే  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమయ్యారు.  చేపమందు  పంపిణీ  విషయమై  చర్చించారు.  చేపమందు  పంపిణీకి  సంబంధించి  మంత్రి తలసాని  శ్రీనివాస్ యాదవ్  అధికారులతో  సమీక్ష నిర్వహించారు.  నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో  చేపమందు  పంపిణీ  ఏర్పాట్లను  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  పరిశీలించారు.  

Latest Videos

చేపమందు పంపిణీని  150 ఏళ్ల నుండి బత్తిన కుటుంబం  పంపిణీ  చేస్తుంది.  ఈ మందు  ఆస్తమా రోగాన్ని తగ్గిస్తుందని  విశ్వసిస్తారు.  ఈ కారణంగానే  మృగశిర కార్తె  రోజున  చేపమందు  కోసం  పెద్ద ఎత్తున  జనం వస్తారు.

click me!