ఐఐటీ జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్: పోలీసుల అదుపులో కడప విద్యార్ధి

By narsimha lodeFirst Published Jun 6, 2023, 10:02 AM IST
Highlights

ఐఐటీ జేఈఈ  పరీక్షలో  స్మార్ట్  కాపీయింగ్ కు  పాల్పడిన  నిందితుడిని  హైద్రాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.    వాట్సాప్ ద్వారా  ఇతర విద్యార్ధులకు  నిందితుడు చేరవేసినట్టుగా  గుర్తించారు  పోలీసులు. 

హైదరాబాద్: ఐఐటీ  జేఈఈ పరీక్షల్లో  స్మార్ట్  కాపీయింగ్ కు  పాల్పడిన  నిందితుడిని పోలీసులు హైద్రాబాద్  పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు.  సికింద్రాబాద్ లోని  ఓ పరీక్ష కేంద్రంలో   పరీక్ష రాసిన  అభ్యర్ధి  వాట్సాప్ ద్వారా  ఇతర పరీక్ష కేంద్రాల్లో  పరీక్ష రాసిన   మరో నలుగురు విద్యార్ధులకు  తాను రాసిన సమాధానాలు చేరవేశారు.   హైద్రాబాద్ దిల్ సుఖ్ నగర్ లో  నిందితుడు    చైతన్య ను   పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 జేఈఈ  పరీక్షలో మాస్ కాపీయింగ్ గురించి ప్రశ్నిస్తున్నారు.  నిందితులు వాట్సాప్ తో పాటు  ఇతర  ఎలక్ట్రానిక్ డివైజ్ లు  ఏమైనా ఉపయోగించారా  అనే విషయాన్ని కూడ పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. మరో వైపు పరీక్షా కేంద్రాల్లో  నలుగురికి  ఎవరెవరు  సహకరించారనే కోనంలో  పోలీసులు ఆరా తీస్తున్నారు.  పోలీసుల అదుపులో  ఉన్న చైతన్య ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని ఉమ్మడి కడప జిల్లాకు  చెందిన వాడిగా  గుర్తించారు.  జేఈఈ  పరీక్షలో  ఈ ఐదుగురే  ఎలక్ట్రానిక్ డివైజ్ లు ఉపయోగించి పరీక్ష  రాశారా ఇంకా ఎవరైనా  ఉన్నారా  అనే విషయమై  కూడ  పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఈ ఏడాది రెండు విడతలుగా  ఐఐటీ జేఈఈ  ప్రవేశ పరీక్షలు నిర్వహించారు.  ఈ ఏడాది జనవరి  24 నుండి ఫిబ్రవరి  1వ తేదీ వరకు  తొలి విడత  జేఈఈ  పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్ ఆరు నుండి  13 వరకు రెండో విడత  జేఈఈ  పరీక్ష నిర్వహించారు.  దేశ వ్యాప్తంగా  23 ఐఐటీ సెంటర్లలో 16,598 సీట్లున్నాయి.  

click me!