హైద్రాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పాటు వడగళ్లు కూడా కురిశాయి.
హైదరాబాద్: నగరంలో సోమవారంనాడు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుండి భానుడి భగభగలతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కానీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మబ్బులతో వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. సాయంత్రం కురిసిన వర్షం కారణంగా నగరంలో పలు ప్రాంతాలు చల్లబడ్డాయి. ఈదురుగాలులతో వర్షం కురిసింది. మరో వైపు ఈ వర్షం కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
నగరంలోని నాంపల్లి, చంచల్ గూడ, సైదాబాద్, చంపాపేట, గోషామహల్, బేగంబజార్, బహదూర్ పురా, కోఠి, ఆబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ,బషీర్ బాగ్, హైదర్ గూడ,హైకోర్టు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడింది. రానున్న మూడు రోజుల్లో హైద్రాబాద్, తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని మ వాతావరణ శాఖ తెలిపింది. వర్షం కారణంగా రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వడగళ్ల వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గతంలో హైద్రాబాద్ లో వడగళ్ల వర్షం కురిసింది. వడగళ్లకు వాహనాలు కూడా దెబ్బతిన్న విషయం తెలిసిందే.