Inter Results: ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

Published : Apr 17, 2023, 05:28 PM IST
Inter Results: ఇంటర్‌ ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

సారాంశం

Telangana Inter Result 2023 : తెలంగాణలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ కలిపి సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి త్వరలో ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నారు అధికారులు.

TS Inter Results 2023 : తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు (Inter Exams) ముగిసిన విషయం తెలిసిందే.  ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగగా.. సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులకు గాను..  4,02,630 మంది విద్యార్థులు హాజరు అయ్యారు.  ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ కలిపి సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హజరయ్యారు.  ఇక పరీక్షలు ముగియడంతో జవాబు పత్రాల మూల్యాంకనంపై దృష్టిసారించారు అధికారులు. ఇప్పటికే ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ మరికొద్ది రోజుల్లో పూర్తి కానున్నది. త్వరలో ఫలితాలను విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ తగు ఏర్పాటు చేసింది. 

ఇక విద్యార్థులు ఎప్పుడెప్పుడు పరీక్ష ఫలితాలు వస్తాయా ? అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం..  తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేయడానికి  కసరత్తులు చేస్తోంది. అంటే.. మే 10న ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌  భావిస్తుందట.  ఇక ఎంసెట్ విషయానికి వస్తే.. తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎంసెట్ అడ్మిషన్లు ప్రారంభం అవుతాయి. 

మరో వైపు.. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు కూడా త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి.. ఇంటర్ పరీక్ష ఫలితాలను వేగంగా విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కృషి చేస్తోంది. తెలంగాణలో జూన్ 1 నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభం కానుంది. మరోవైపు..పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3న మొదలై ఏప్రిల్ 11తో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎస్సీ బోర్డు త్వరలో పదవ తరగతి ఫలితాలను విడుదల చేయాలని భావిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 21 వరకు మూల్యాంకనం, ఆ తర్వాత టాబ్యులేషన్ నిర్వహించి, మే 15న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్