హైద్రాబాద్‌లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ సెంటర్: తెలంగాణ సర్కార్‌తో ఒప్పందం

By narsimha lode  |  First Published Jan 16, 2023, 8:48 PM IST

హైద్రాబాద్  లో  సెంటర్ ఫర్ ఫోర్త్  ఇండస్ట్రీయల్  రివల్యూషన్  సెంటర్ ను  హైద్రావాద్ లో  ఏర్పాటు  చేసేందుకు  వరల్డ్ ఎకానమిక్  ఫోరం  ముందుకు వచ్చింది. ఈ మేరకు  తెలంగాణ ప్రభుత్వంతో  ఒప్పందం చేసుకుంది.  
 


హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో  మరో ప్రతిష్టాత్మక  సంస్థ  ఏర్పాటుకు  వరల్డ్  ఎకనామిక్  ఫోరం నిర్ణయం తీసుకుంది.  సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్  సెంటర్ ను  హైద్రాబాద్ లో ఏర్పాటు  చేయనున్నారు.  థావోస్ లో జరిగిన ప్రపంచ   ఆర్ధిక సదస్సులో  తెలంగాణ ప్రభుత్వంతో  ఈ ఒప్పందం  జరిగింది.   వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌  మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్ , తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్  లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

 తెలంగాణ ఐటీ,పరిశ్రమల మంత్రి  కేటీఆర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ అధ్యక్షుడు బోర్జ్ బ్రెందేతో పాటు ఇతర అధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ  సెంటర్  అధ్యయనం చేస్తుంది. భారత దేశంలో సెంటర్  ఫర్  ఫోర్త్  ఇండస్ట్రీయల్  రివల్యూషన్ సెంటర్  విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్  దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. 

Latest Videos

ఈ కేంద్రం ఏర్పాటు కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు ఐటి, మున్సిపల్,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ .లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలున్నాయని మంత్రి చెప్పారు. అందుకే  ఈ సెంటర్ ను హైద్రాబాద్ లో  ఏర్పాటుకు  వరల్డ్  ఎకానమిక్  ఫోరం ముందుకు వచ్చిందన్నారు.. ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సెన్సెస్ రంగం ఎదుగుదల, ఎకో సిస్టం పెంపొందించడానికి తమ ప్రభుత్వం చేపట్టిన ముందడుగులో భాగంగా  ఈ సెంటర్ ఏర్పాటును చూడాలని  కేటీఆర్ కోరారు. 

. లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవడానికి ఈ కేంద్రం ఏర్పాటు దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు..హెల్త్‌కేర్,లైఫ్ సైన్సెస్‌ రంగాల్లో అగ్రగామిగా నిలిచేందుకు భారతదేశానికి అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే అన్నారు.

.ప్రభుత్వం,పరిశ్రమల మధ్య సమన్వయం తోపాటు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయాల్లో  ఈ సెంటర్  కీలకపాత్ర పోషించనుందన్నారు. హైదరాబాద్‌లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్  సెంటర్  ఏర్పాటు వల్ల ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఫోరమ్ అధ్యక్షుడు బ్రెందే అన్నారు. వ్యాక్సిన్ లు, ఎన్నో ఔషధాల తయారీలో భారతదేశం, హైదరాబాద్ లకు మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు.

నాలుగవ పారిశ్రామిక విప్లవ సాంకేతికతను ఉపయోగించుకొని ఆరోగ్య సంరక్షణలో గ్లోబల్ పవర్ హౌస్ గా ఇండియా మారుతుందన్నారు . ప్రాంతీయ, జాతీయ , ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగం లో వినూత్న మార్పులు తేవడం తోపాటు రోగులకు ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడంలో ఈ కొత్త కేంద్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు

click me!