అంగవైకల్యంతో పుట్టిన కొడుకు: మెర్సీకిల్లింగ్ ఇష్టం లేక తల్లి స్వాతి సూసైడ్

హైద్రాబాద్  కూకట్ పల్లిలో  వివాహిత  స్వాతి ఆత్మహత్య చేసుకుంది.  కొడుకు మెర్సీ కిల్లింగ్  కు ధరఖాస్తు  చేసుకోవడం ఇష్టం లేక వివాహిత  స్వాతి ఆత్మహత్య చేసుకుంది.


హైద్రాబాద్  కూకట్ పల్లిలో  వివాహిత  స్వాతి ఆత్మహత్య  కేసులో  కీలక విషయాలు వెలుగు చూశాయి.  కొడుకు మెర్సీ కిల్లింగ్ కు ధరఖాస్తు  చేయడం ఇష్టం లేక  స్వాతి ఆత్మహత్య చేసుకుంది.  


హైదరాబాద్: నగరంలోని  కూకట్ పల్లిలో వివాహిత  స్వాతి  ఆత్మహత్య  చేసుకున్న ఘటనలో  కీలక విషయాలు వెలుగు చూశాయి. అంగవైక్యలం తో పుట్టిన కొడుకు మెర్సీకిల్లింగ్  విషయమై కుటుంబ సభ్యుల వేధింపులతో స్వాతి ఆత్మహత్య చేసుకుందని  స్వాతి పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. కూకట్‌పల్లి  కేపీహెచ్‌బీ కాలనీలోని  23 అంతస్థు నుండి  దూకి  వివాహిత  స్వాతి ఆత్మహత్య  చేసుకుంది.

Latest Videos

స్వాతి దంపతులకు  ఎనిమిదేళ్ల  అంగవైకల్యం ఉన్న కొడుకు ఉణ్నాడు.  అంగవైకల్యంతో ఉన్న కొడుకును  మెర్సీకిల్లింగ్  కోసం  ధరఖాస్తు  చేయాలని  స్వాతి భర్త  శ్రీధర్ , అతని బంధువులు  వేధింపులకు గురి చేశారని  స్వాతి పేరేంట్స్ ఆరోపించారు.  అంగవైకల్యం ఉన్న  కొడుకు మెర్సీ కిల్లింగ్  కి ధరఖాస్తు చేయడం స్వాతికి  ఇష్టం లేదని వారు చెబుతున్నారు.  అంగవైకల్యం ఉన్నా కూడా తన  కొడుకును  సాకుతానని  స్వాతి  కుటుంబ సభ్యులతో  తెగేసి చెప్పిందని స్వాతి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయమై  భర్త  శ్రీధర్ సహా అతని తరపు బంధువుల  వేధింపులు తట్టుకోలేక  స్వాతి  ఆత్మహత్య చేసుకుందని పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. స్వాతి మృతదేహన్ని  గాంధీ ఆసుపత్రికి  తరలించారు.   పోస్టుమార్టం  తర్వాత కుటుంబసభ్యులకు అందించనున్నారు. స్వాతి భర్త శ్రీధర్  సహా   ఎవరూ  కూడ అందుబాటులో లేరని స్వాతి  బంధువులు చెబుతున్నారు.

click me!