నేపాల్ నుండి హైద్రాబాద్ కు పాకిస్తాన్ యువకుడు: అదుపులోకి తీసుకున్న పోలీసులు

Published : Aug 31, 2023, 03:32 PM IST
 నేపాల్ నుండి  హైద్రాబాద్ కు పాకిస్తాన్ యువకుడు: అదుపులోకి తీసుకున్న పోలీసులు

సారాంశం

నేపాల్ నుండి భారత్ లోకి అక్రమంగా  ప్రవేశించిన  పాకిస్తాన్ కు చెందిన  మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. 

హైదరాబాద్:పాకిస్తాన్ నుండి అక్రమంగా  హైద్రాబాద్ కు వచ్చిన  మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వీసా లేకుండా  నేపాల్ మీదుగా  భారత్ లోకి  ఫయాజ్ ప్రవేశించాడు. ఈ విషయమై  హైద్రాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులకు  కచ్చితమైన సమాచారం అందింది.ఈ సమాచారం ఆధారంగా  పోలీసులు  ఫయాజ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఫయాజ్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు.  

హైద్రాబాద్ కు చెందిన యువతి  కోసం  ఫయాజ్ ఇక్కడికి వచ్చినట్టుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.  ఫయాజ్ నుండి  వివరాలు సేకరిస్తున్నారు.   మరో వైపు ఫయాజ్ ను  టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.ఈ సమయంలో  ఆ యువతి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంది.  ఫయాజ్ ను చూపాలని పోలీసులను కోరింది. ఫయాజ్ నుండి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?