అందరూ చూస్తుండగానే చైన్ స్నాచింగ్... ఈ ముదురు దొంగను ఏం చేసారో చూడండి..! (వీడియో)

Published : Aug 31, 2023, 03:08 PM IST
అందరూ చూస్తుండగానే చైన్ స్నాచింగ్... ఈ ముదురు దొంగను ఏం చేసారో చూడండి..! (వీడియో)

సారాంశం

అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువతి మెడలోంచి బంగారు గొలుసు లాక్కుని పరారవుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడో ముదురు చైన్ స్నాచర్. 

కరీంనగర్ : ఎవరూ లేని నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా కనిపించే మహిళలను చైన్ స్నాచర్లు టార్గెట్ చేస్తుంటారు. కానీ వీడు ముదురు దొంగలా వున్నాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై యువతి మెడలోంచి బంగారు గొలుసు లాక్కుని పారిపోబోయాడు. కానీ ఓ ఆటో డ్రైవర్, స్థానిక యువకులు వెంటనే అలర్ట్ అయి పారిపోతున్న దొంగను పట్టుకుని దేహశుద్ది చేసారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... తిమ్మాపూర్ గ్రామానికి చెందిన లాస్య పని వుండటంతో బుధవారం కరీంనగర్ కు వెళ్లింది. పని ముగించుకుని రాత్రి స్వగ్రామానికి వెళ్ళేందుకు ఓ ఆటో ఎక్కింది. అయితే ఆటో తిమ్మాపూర్ ఎల్ఎండి కాలనీకి చేరుకోగానే ఓ దొంగ చేతివాటం చూపించాడు. ప్రయాణికులను దించేందుకు ఆటో ఆగగా అప్పటికే అక్కడ కాపుకాసిన దొంగ లాస్య మెడలోని చెయిన్ లాక్కుని పరుగుతీసాడు. దీంతో ఆటో డ్రైవర్ తో పాటు స్థానిక యువకులు సదరు దొంగను వెంబడించిపట్టుకున్నారు. 

వీడియో

ఇలా అందరూ చూస్తుండగానే చెయిన్ స్నాచింగ్ కు పాల్పడ్డది తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామానిక చెందిన నరేష్ గా గుర్తించారు. అతడు గతంలోనూ అనేక దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం. జల్సాలకు అలవాటుపడిన అతడు ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 

Read More  పెళ్లి వేడుకల్లో అపశృతి.. నీటి సంపులో పడి బాలుడు మృతి..

ఆటో డ్రైవర్ తో పాటు యువకులు కుమార్, రాజు, మురుగన్ సమయానికి స్పందించి దొంగను పట్టుకున్నారు. అతడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. అతడు దొంగిలించిన బంగారు గొలుసును తిరిగి యువతికి అందజేసారు. 

PREV
click me!

Recommended Stories

KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu
Hyderabad Weather : ఈ వర్షాలు ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. ఈ జిల్లాల్లో డేంజర్ వానలు, బిఅలర్ట్