టీచర్ల బదిలీలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్:కసరత్తు చేస్తున్న విద్యా శాఖ

By narsimha lode  |  First Published Aug 31, 2023, 2:07 PM IST


ఉపాధ్యాయ బదిలీలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోర్టు స్టే కారణంగా ఇంతకాలం బదిలీలు చేపట్టలేదు ప్రభుత్వం. 


హైదరాబాద్: ఉపాధ్యాయ బదిలీలకు తెలంగాణ హైకోర్టు   గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   టీచర్ల బదిలీలపై ఉన్న స్టేను  హైకోర్టు బుధవారంనాడు ఎత్తివేసింది. దీంతో టీచర్ల బదిలీల ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణను విద్యాశాఖ సిద్దం  చేస్తుంది.   ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను  సెప్టెంబర్ మాసంలో  చేపట్టాలని  ప్రభుత్వం  భావిస్తుంది.

తెలంగాణలో  టీచర్ల బదిలీలకు సంబంధించి  ఈ ఏడాది జనవరి మాసంలోనే  రాష్ట్ర  ప్రభుత్వం  షెడ్యూల్ ను విడుదల చేసింది.  అయితే టీచర్ల బదిలీల కోసం  59 వేల మంది టీచర్లు ధరఖాస్తు చేసుకున్నారు. అయితే అదే సమయంలో  టీచర్ల బదిలీల ప్రక్రియపై  కొందరు కోర్టును ఆశ్రయించారు.ఈ విషయమై అన్ని వర్గాల వాదనలను విన్న తర్వాత బదిలీలకు తెలంగాణ హైకోర్టు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  బదిలీలపై  ఉన్న స్టేను ఎత్తివేసింది. టీచర్ల బదిలీలపై గతంలోనే తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.

Latest Videos

టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి  విద్యా శాఖ అధికారులు  రంగం సిద్దం  చేస్తున్నారు.గతంలో టీచర్ల బదిలీలకు సంబంధించి విడుదల చేసిన షెడ్యూల్ లో మార్పులు చేర్పులు చేసి  కొత్త షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.  అయితే బదిలీల కోసం గతంలో  ధరఖాస్తులను  పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియలో ఉపాధ్యాయ సంఘం నేతలకు కేటాయించిన  పాయింట్లను తొలగించనున్నారు.  

also read:తెలంగాణలో టీచర్ల బదిలీలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్

2018లో టీచర్ల సాధారణ బదిలీలు చేశారు. 2018లో  48 వేల ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి.  ఈ దఫా షెడ్యూల్ లో  కనీసం 50 వేల మంది  ఉపాధ్యాయుల బదిలీలు జరిగే అవకాశం ఉంది.తాజాగా కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు  టీచర్ల బదిలీలకు సంబంధించి  మార్గదర్శకాలను  ప్రభుత్వం విడుదల చేసే అవకాశం లేకపోలేదు.

click me!