
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి 4వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ ప్యానల్ బోర్డులో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. మంటల చెలరేగడంతో నాలుగో అంతస్తులో దట్టంగా పొగ అలుముకుంది. సకాలంలో స్పందించి మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.