Telangana cultivation: 10 ఏళ్లలో 81.6 శాతం పెరిగిన తెలంగాణ సాగు విస్తీర్ణం..

By Mahesh Rajamoni  |  First Published Oct 7, 2023, 4:02 PM IST

Hyderabad: దేశానికి వ్యవసాయంలో టార్చ్ బేరర్ లా తెలంగాణ నిలుస్తున్నదని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. విస్తీర్ణంలో తెలంగాణ కన్నా పెద్దగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ప్రగతికోసం పెడుతున్న ఖర్చులో 25 శాతం కూడా పెట్టడం లేదన్నారు. కోట్లాది మందికి ఉపాధి కల్పించే రంగం వ్యవసాయ రంగం అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సాగుకు ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహిస్తున్నార‌ని తెలిపారు. 
 


Telangana saw 81.6% increase in cultivation area:  వ్య‌వ‌సాయ రంగంలో తెలంగాణ రాష్ట్రం తిరుగులేని అభివృద్ధితో దూసుకుపోతున్న‌ద‌నీ, దీనికి ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) నాయ‌క‌త్వంలోని భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ప్ర‌భుత్వం తీసుకున్న మెరుగైన చ‌ర్య‌లే కార‌ణ‌మ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. 2014లో సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు కాగా 2022-23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు పెరిగిందనీ, అంటే ఇదే కాలంలో 81.6 శాతం పెరిగిందని మంత్రి తెలిపారు.

మీడియాతో మంత్రి మాట్లాడుతూ గత 10 ఏళ్లలో వ్యవసాయం సాధించిన ప్రగతిని వివరిస్తూ వరి ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రూ.1.33 లక్షల కోట్లు వెచ్చించి 722.92 లక్షల టన్నుల వరిసాగు చేశామనీ, రూ.11,439.06 కోట్లు వెచ్చించి ఇతర పంటలను కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగ ప్ర‌గ‌తిని వివ‌రిస్తూ.. 2014 నాటికి సాగు విస్తీర్ణం కోటీ 31 లక్షల ఎకరాలు కాగా 2022-23 నాటికి అది 2 కోట్ల 38 లక్షల ఎకరాలకు పెరిగింది. పెరిగిన సాగు విస్తీర్ణం కోటి 7 లక్షల ఎకరాలు (81.6 %) గా ఉంద‌ని తెలిపారు. 

Latest Videos

undefined

ఇక ధాన్యం ఉత్ప‌త్తి గురించి వివ‌రిస్తూ.. 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2022-23 నాటికి రికార్డు స్థాయిలో సుమారు 3.00 కోట్ల టన్నులకు చేరుకున్నద‌ని తెలిపారు. ధాన్యం సేక‌ర‌ణ కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని తెలిపిన మంత్రి.. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి నేటి వరకు రూ. లక్షా 33 వేల కోట్లతో, 722.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జ‌రిగింద‌న్నారు. అలాగే ధాన్యం కాకుండా రూ.11,439.06 కోట్లతో ఇతర పంటల సేకరణ కూడా జ‌రిగింద‌ని తెలిపారు. సాగుకు నీరందించ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌నీ, దీని కార‌ణంగా వ్య‌వ‌సాయ విస్తీర్ణం పెర‌గింద‌ని తెలిపారు. 

పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టుల పూర్తి, నూతన ఎత్తిపోతల పథకాల వల్ల వచ్చిన సాగునీటి ద్వారా సాగు విస్తీర్ణం పెరిగింద‌న్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామ‌న్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణ లో 6 జిల్లాల్లోని మరో 12.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంద‌ని తెలిపారు. రూ. 5349 కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరించి,  8.93 టీఎంసీల సామర్థ్యంతో 15.05 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జ‌రిగింద‌న్నారు.

రాష్ట్రంలో సాగు నీటి శిస్తు రద్దు చేసి.. రైతుల‌కు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామ‌ని చెప్పారు. సాలీనా దాదాపు రూ.10,500 కోట్లు భరిస్తూ, రాష్ట్రంలోని రైతులందరికి 24 గంటల ఉచిత విద్యుత్తును బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అందిస్తున్న‌ద‌ని అన్నారు. రైతుల కోసం అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను సైతం అమ‌లు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున గత 11 విడతలలో రూ.72, 815 కోట్లు అందించామ‌న్నారు. రైతు భీమా పథకం ద్వారా ఇప్పటివరకు 1,11,320 మంది రైతు కుటుంబాలకు  రూ. 5,566 కోట్ల  భీమా పరిహారం చెల్లింపులు జ‌రిగాయ‌ని వెల్ల‌డించారు.

click me!