సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి కారణమైన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును మరింత వేగం పెంచారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి కారణమైన రోడ్డు ప్రమాదం విషయంలో కీలక విషయాన్ని పోలీసులు గుర్తించారు. లాస్య నందిత ప్రయాణీస్తున్న కారు ముందు వెళ్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది. లాస్య నందిత ప్రయాణీస్తున్న కారు ఢీకొన్న టిప్పర్ ను పోలీసులు గుర్తించారు. ఈ టిప్పర్ ను పోలీసులు సీజ్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పటాన్ చెరు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. లాస్య నందిత ప్రయాణీస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టి రోడ్డుకు ఎడమవైపున ఉన్న రెయిలింగ్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందారు.
undefined
also read:తలకు బలమైన గాయాలతోనే మృతి: లాస్య నందిత పోస్టుమార్టం నివేదిక
ఈ ప్రమాదం జరిగిన రోజున ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణీస్తున్న కారు విడిభాగాలు సుమారు 200 మీటర్ల దూరం వరకు పడిపోయాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆరు టిప్పర్లు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే లాస్య నందిత ప్రయాణీస్తున్న కారు అతి వేగంతో వచ్చి టిప్పర్ ను ఢీకొట్టిడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ టిప్పర్ ను కర్ణాటకలో పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న కారు బలంగా ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
also read:రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి: అతి వేగమే కారణమా?
ఈ ప్రమాదం జరిగిన సమయంలో లాస్య నందిత ప్రయాణీస్తున్న కారు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తున్నట్టుగా స్పీడో మీటర్ సూచిస్తుంది. లాస్య నందిత కారు నడిపిన వ్యక్తి నిద్రమత్తులో ఉండి టిప్పర్ కు ఢీకొట్టాడా, లేక వేగాన్ని నియంత్రించలేకపోయాడా అనే విషయమై పోలీసులు దర్యాప్తులో తేల్చనున్నారు.
also read:అచ్చిరాని ఫిబ్రవరి: తండ్రి మరణించిన ఏడాదికే లాస్య నందిత మృతి
ఫిబ్రవరి 13వ తేదీన నల్గొండలో జరిగిన బీఆర్ఎస్ సభకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో లాస్య నందిత కారుకు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం నుండి లాస్య నందిత సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం జరిగిన పది రోజులకే ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందారు.