కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటా పోటీ ప్రాజెక్టుల బాట పట్టారు. ప్రాజెక్టుల అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితిలు పోటా పోటీగా ప్రాజెక్టుల బాట పట్టాయి. ఛలో మేడిగడ్డకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వెళ్లారు. మరో వైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సందర్శించనున్నారు.
also read:కోటి ఇళ్లకు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్: రూ. 75 వేల కోట్లు
undefined
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు.ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం జరిగింది.అయితే మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది అక్టోబర్ మాసంలో కుంగిపోయింది. ఈ బ్యారేజీకి చెందిన మూడు పిల్లర్లు కుంగుబాటుకు గురయ్యాయి. ఈ బ్యారేజీని గత మాసంలో ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రభుత్వం చూపింది. ఈ టూర్ కు బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. అదే రోజున నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నల్గొండలో సభను ఏర్పాటు చేశారు. అయితే మేడిగడ్డ బ్యారేజీ ఎలా కుంగిపోయింది, కారణాలపై ఇంజనీర్లు మేడిగడ్డ వద్దే ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజేంటేషన్ లో వివరించారు.
also read:బీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన నాగర్ కర్నూల్ ఎంపీ రాములు
గతంలోనే మేడిగడ్డను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. ఇందుకు సంబంధించిన నివేదికను కూడ అందించింది. మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం బ్యారేజీలో కూడ నీళ్లు లీకౌతున్నాయి. దీంతో ప్రభుత్వం ఈ బ్యారేజీలో నీటిని ఖాళీ చేసింది. బీఆర్ఎస్ హయంలో ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉందో ఈ బ్యారేజీలను చూస్తే అర్ధమౌతుందని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. అయితే కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ మేరకు ఇవాళ ఛలో మేడిగడ్డ పేరుతో ఆపార్టీ ప్రజా ప్రతినిధులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు.
also read:ఏం చేయాలి, ఏం చేయవద్దు: సోషల్ మీడియాలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఆసక్తికర వీడియో
ఈ కార్యక్రమానికి పోటీగా కాంగ్రెస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సర్కార్ ఏ రకంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేసిందో వివరించేందుకు కాంగ్రెస్ నేతలు ఈ టూర్ ను చేపట్టారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఈ టూర్ లో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి మినహా మిగిలిన ప్రజా ప్రతినిధులంతా ఈ యాత్రలో పాల్గొంటారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అప్పట్లో బీఆర్ఎస్ సర్కార్ విస్తృతంగా ప్రచారం చేసుకుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ సర్కార్ ఏం చేసిందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ భావిస్తుంది.