హైద్రాబాద్ చైతన్యపురిలో పోపిస్ట్రా విక్రయం: రాజస్థాన్‌కు చెందిన రమేష్ అరెస్ట్

Published : Jul 23, 2023, 04:05 PM ISTUpdated : Jul 23, 2023, 04:20 PM IST
హైద్రాబాద్ చైతన్యపురిలో పోపిస్ట్రా విక్రయం: రాజస్థాన్‌కు చెందిన రమేష్ అరెస్ట్

సారాంశం

హైద్రాబాద్ చైతన్యపురిలో  పోపిస్ట్రాను   విక్రయిస్తున్న   రమేష్ ను పోలీసులు అరెస్ట్  చేశారు. రమేష్ రాజస్థాన్ కు చెందినవాడుగా పోలీసులు గుర్తించారు.


హైదరాబాద్: నగరంలోని చైతన్యపురిలో  పోపిస్ట్రా అనే మత్తుమందును విక్రయిస్తున్నరాజస్థాన్ కు చెందిన  రమేష్ ను  ఆదివారంనాడు  పోలీసులు అరెస్ట్  చేశారు. రాజస్థాన్ కు చెందిన రమేష్ నుండి  ఐదు కిలోల  పోపిస్ట్రాను పోలీసులు సీజ్  చేశారు. పోపిస్ట్రా  ద్వారా పలురకాల మత్తు పదార్ధాలను  రమేష్  తయారు చేస్తున్నట్టుగా  పోలీసులు గుర్తించారు.  పోపిస్ట్రాను  రమేష్ ఇప్పటివరకు  ఎవరెవరికి  విక్రయించాడనే  విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.

గతంలో కూడ హైద్రాబాద్ లో  పోపిస్ట్రా విక్రయిస్తున్నవారిని పోలీసులు అరెస్ట్  చేశారు.హైద్రాబాద్ రాచకొండ పోలీసులు దాడులు నిర్వహించి  పోపిస్ట్రా ను సీజ్ చేశారు.  పంజాబ్ నుండి హైద్రాబాద్ కు పోపిస్ట్రాను తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు  2022 ఏప్రిల్  2వ తేదీన  అరెస్ట్  చేశారు. నిందితుల నుండి 900 గ్రాముల  పోపిస్ట్రాను సీజ్ చేశారు.కీసర- షామీర్ పేట  రోడ్డులో  పోలీసులు  సోదాలు  నిర్వహించిన  సమయంలో పోపిస్ట్రాను తరలిస్తున్న ఇద్దరిని  అరెస్ట్  చేశారు.హైద్రాబాద్ నగరంలో  డ్రగ్స్ సరఫరా చేసేవారిపై  పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.  డ్రగ్స్ తో పాటు గంజాయి  సరఫరా చేసేవారిపై  పోలీసులు నిఘా పెట్టారు.

హైద్రాబాద్ నగరంలో  డ్రగ్స్ సరఫరా చేసేవారిపై  పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.  డ్రగ్స్ తో పాటు గంజాయి  సరఫరా చేసేవారిపై  పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్స్ కొనుగోలు  చేస్తున్నవారిపై  పోలీసులు కేసులు పెడుతున్నారు.  గోవా ,ముంబై ల నుండి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని   హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్  చేశారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??
Rain Alert: ఎండల వేడికి బ్రేక్.. ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఐఎండీ కూల్ అప్‌డేట్