మైనార్టీలకు రూ. 1లక్ష ఆర్ధిక సహాయం: కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు

By narsimha lode  |  First Published Jul 23, 2023, 2:16 PM IST

మైనార్టీలకు  రూ. లక్ష ఆర్ధిక సహాయం అందించే పథకాన్ని కేసీఆర్ సర్కార్ తీసుకు వచ్చింది.ఈ మేరకు  ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి.


హైదరాబాద్: బీసీల మాదిరిగానే  మైనార్టీలకు  రూ. 1 లక్ష ఆర్ధిక సహాయం  చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  ఆదివారంనాడు  ఉత్తర్వులు జారీ చేసింది కేసీఆర్ సర్కార్. 

  మైనారిటీల ఆర్థిక స్వావలంబన దిశగా  ఈ పథకం దోహదపడనుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కులమతాలకు అతీతంగా పేదరికాన్ని పారదోలేందుకు  ఈ పథకాన్ని తీసుకువచ్చినట్టుగా  సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే అన్ని వర్గాల పేదలకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని  సీఎం చెప్పారు.మైనారిటీల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వున్నదని సిఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. 

Latest Videos

విద్య, ఉపాధి సహా పలు రంగాల్లో ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తూ మైనార్టీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగిస్తున్న విషయాన్ని  కేసీఆర్ గుర్తు  చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్పలితాలను అందిస్తున్నదని సిఎం చెప్పారు.భిన్న సంస్కృతులను, విభిన్న సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తామని  సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ నెల 15వ తేదీ నుండి బీసీలకు  లక్ష రూపాయాల ఆర్ధిక సహాయాన్ని  కేసీఆర్ సర్కార్ అమలు చేస్తుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన కుల వృత్తులకు చెందిన వారికి లక్ష రూపాయాలను ఆర్ధిక సహాయంగా అందిస్తుంది. ఈ ఏడాది జూన్  20వ తేదీ నుండి  ఈ పథకం కింద  ఆర్థిక సహాయం కోసం ధరఖాస్తులను ఆహ్వానించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమర్థవంతమైన కార్యాచరణ సత్పలితాలను అందిస్తున్నదని సిఎం చెప్పారు.భిన్న సంస్కృతులను, విభిన్న సాంప్రదాయాలను సమానంగా ఆదరిస్తామని  సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.ఇప్పటికే  మైనార్టీలకు పలు రకాల పథకాలను తెలంగాణ సర్కార్ అమలు  చేస్తుంది. షాదీ ముబారక్, విద్యార్ధుల విదేశీ విద్య కోసం  రూ. 20 లక్షలు, రంజాన్ కానుకలు, ఆజ్మీర్ లో తెలంగాణ వారి కోసం రూ. 5 కోట్లతో గెస్ట్ హౌస్ ను నిర్మిస్తున్నారు.
 

click me!