Hyderabad: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు.
Godavari irrigation projects: తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని గోదావరి నీటి పారుదల ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. గత నాలుగు రోజులుగా పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిపై ఉన్న అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు భారీగా ఇన్ ఫ్లో వస్తోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లింక్-1 బ్యారేజీలైన లక్ష్మీ, సరస్వతి, పార్వతిల వరద గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు లింక్ -1లోని పంప్ హౌజ్ ల కార్యకలాపాలను కూడా నిలిపివేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ లలో విస్తరించిన పరీవాహక ప్రాంతం నుంచి వరద ప్రవాహం పెరగడంతో గోదావరి నది ఉధృతుంగా ప్రవహిస్తోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులకు చేరువలో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 43కు పైగా టీఎంసీలు దాటింది.
జూలై 25 నాటికి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని భావించిన ప్రాజెక్టు అధికారులు కమాండ్ ఏరియాలో భారీ వర్షాల దృష్ట్యా వాయిదా వేశారు. మరో వారం రోజుల పాటు ఇన్ ఫ్లో ఇదే స్థాయిలో కొనసాగితే ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా మెరుగుపడుతుందని చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా 1.5 లక్షల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్టు 17.80 టీఎంసీల స్థూల నిల్వకు గాను 7.5టీఎంసీలకు చేరుకోగా దాని ప్రత్యక్ష నిల్వకు రోజుకు 3 టీఎంసీల కంటే ఎక్కువ నీరు రావడంతో 36000 క్యూసెక్కులు అందుతున్నాయి. లోయర్ మానేరుకు 12500 క్యూసెక్కులు, మిడ్ మానేరుకు 9000 క్యూసెక్కుల చొప్పున ఇన్ ఫ్లో వస్తోంది. సుమారు 1.5 లక్షల క్యూసెక్కుల భారీ ఇన్ ఫ్లో వస్తున్న కడెం ప్రాజెక్టుకు అదే పరిమాణంలో వరద విడుదలవుతోంది.
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన తెలిపారు. వర్ష సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి 428 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు, 27 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) బృందాలు పనిచేస్తున్నాయని కమిషనర్ తెలిపారు.