
హైదరాబాద్: ట్విట్టర్‌కి హైద్రాబాద్ పోలీసుల షాకిచ్చారు. ఫేక్ వీడియోలు ప్రచారం చేశారనే విషయమై ట్విట్టర్ కి హైద్రాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేశారనే ఆరోపణలతో ట్విట్టర్ కు పోలీసులు నోటీసులిచ్చారు.పోలీసులను కించపరుస్తూ ఇద్దరు యువకులు ఫేక్ వీడియోలను ట్విట్టర్ లో పోస్టు చేయడంపై పోలీసులు ట్విట్టర్ కు నోటీసులు ఇచ్చారు.
also read:ట్విట్టర్ ఇంటర్మీడియరీ హోదాను కోల్పోయిందంటున్న కేంద్రం, సాధ్యమా..?
ఈ వీడియోలను అప్‌లోడ్ చేసిన ఇద్దరు యువకుల సమాచారం ఇవ్వాలని కూడ ఆ నోటీసులో పోలీసులు కోరారు. నటి మీరాచోప్రా ఫిర్యాదుకు సంబంధించిన విషయమై కూడ ఆ నోటీసులో హైద్రాబాద్ పోలీసులు ట్విటర్ట్ ను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ట్విట్టర్ వ్యవహరించడం లేదని కేంద్రం ఆగ్రహంతో ఉంది. కొత్త ఐటీ నిబంధనల ప్రకారంగా అధికారుల నియామకంలో ట్విట్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు లేకపోలేదు.
ట్విట్టర్ లో పోస్టు చేసిన ఫేక్ కంటెంట్ పై ఆ సంస్థనే ఇక బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ నెల 19వ తేదీన తమ ముందు హాజరుకావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడ ట్విట్టర్ కు ఇటీవలనే సమన్లు పంపింది. ఈ సమన్లు పంపిన తర్వాత కంప్లైయినింగ్ అధికారి నియామకంపై కసరత్తు ప్రారంభించింది.