కోవిడ్ తర్వాత అనారోగ్యం.. రూ.50లక్షలు ఖర్చుచేసినా దక్కని ప్రాణం..!

By telugu news teamFirst Published Jun 17, 2021, 10:07 AM IST
Highlights

కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోతున్నవారు కూడా రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. తాజాగా.. ఓ యువతి కరోనా నుంచి కోలుకున్న తర్వాత వచ్చిన సమస్యలతో పోరాడి ప్రాణాలు విడిచింది.

కరోనా మహమ్మారి దేశంలో ఎంతోమందిని బలిగొంది. ఈ సెకండ్ వేవ్ లో ముఖ్యంగా చాలా మంది యువత ప్రాణాలు కోల్పోయింది. కాగా.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోతున్నవారు కూడా రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. తాజాగా.. ఓ యువతి కరోనా నుంచి కోలుకున్న తర్వాత వచ్చిన సమస్యలతో పోరాడి ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని స్థానిక ఎన్టీపీసీ కృష్ణానగర్ కు చెందిన పెండ్యాల రవీందర్ రెడ్డి కుమార్తె నరిష్మ రెడ్డి(28) హైదరాబాద్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఏడున్నరేళ్ల క్రితం అమెరికా వెళ్లి.. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా స్థిరపడ్డారు.

మే నెలాఖరులో పెళ్లి ఉండటంతో రెండు నెలల కిందటే అమెరికా నుంచి వచ్చారు. పనిమీద చెన్నై వెళ్లి వచ్చిన అనంతరం కరనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూ కోవిడ్ నుంచి కోలుకున్నారు. అనంతరం ఊపిరితిత్తులపై ఎక్కువ ప్రభావం చూపడంతో తిరిగి అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి.

40రోజులకుపైగా మృత్యువుతో పోరాడి మంగళవారం రాత్రి ఆమె మృతి చెందారు. చికిత్స కోసం దాదాపు రూ.50లక్షలకు పైగా ఖర్చు చేశామని.. అయినా ప్రాణం దక్కలేదని ఆమె కుటుంబసభ్యులు చెప్పడం గమనార్హం.
 

click me!