ఉత్కంఠ: రవి ప్రకాష్ రేపు పోలీసుల ముందుకు వస్తారా?

By narsimha lodeFirst Published May 9, 2019, 6:28 PM IST
Highlights

టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌ శుక్రవారం నాడు పోలీసుల విచారణకు హాజరౌతారా లేదా అనేది ప్రస్తుతం పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 10వ తేదీ 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పోలీసులు రవి ప్రకాష్  ఇంటికి నోటీసులు జారీ చేశారు.
 

హైదరాబాద్:  టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌ శుక్రవారం నాడు పోలీసుల విచారణకు హాజరౌతారా లేదా అనేది ప్రస్తుతం పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 10వ తేదీ 11 గంటలకు తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పోలీసులు రవి ప్రకాష్  ఇంటికి నోటీసులు జారీ చేశారు.

కొత్త యాజమాన్యానికి వ్యతిరేకంగా రవి ప్రకాష్ వ్యవహరిస్తున్నాడని  అలంద సంస్థ ఆరోపణలు చేసింది. అంతేకాదు రవి ప్రకాష్ ఫోర్జరీ చేశాడని కూడ ఆ సంస్థ  కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గురువారం నాడు రవి ప్రకాష్ ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. శుక్రవారం నాడు తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని రవి ప్రకాష్ ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు.

మరో వైపు ఇదే కేసుకు సంబంధించి నటుడు శివాజీ ఇంట్లో కూడ పోలీసులు సోదాలు నిర్వహించారు. శివాజీకి కూడ నోటీసులు జారీ చేశారు.  శుక్రవారం నాడు పోలీసుల విచారణకు రవి ప్రకాష్ హాజరౌతారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

ఒకవేళ రవిప్రకాష్ విచారణకు హాజరు కాకపోతే ఏం చేయాలనే దానిపై కూడ పోలీసులు ప్రణాళికను సిద్దం చేశారని అంటున్నారు.రవి ప్రకాష్ విచారణకు హాజరైతే  ఏం ప్రశ్నలు వేయాలనే దానిపై కూడ పోలీసులు ఓ ప్రశ్నావళిని కూడ రూపొందించినట్టుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

రవిప్రకాష్ భార్యకు నోటీసులు అందజేసిన పోలీసులు

రవిప్రకాష్‌ కోసం రెండు రోజులుగా గాలింపు: పాస్‌పోర్ట్ స్వాధీనం

టీవీ9 వివాదం: రవిప్రకాష్‌తో హీరో శివాజీ లింక్ ఇదే

టీవీ9 చేతులు మారిందిలా : రవి ప్రకాష్‌పై ఆరోపణలివే

టీవీ9 సీఈఓ రవిప్రకాష్‌కు ఉద్వాసన?

టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ ఇంట్లో పోలీసుల సోదాలు

click me!