ఒకరు గోడ మీద పిల్లి, మరొకరు అవకాశవాది: కేసీఆర్‌, బాబుపై దత్తన్న వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 09, 2019, 06:06 PM ISTUpdated : May 09, 2019, 06:12 PM IST
ఒకరు గోడ మీద పిల్లి, మరొకరు అవకాశవాది: కేసీఆర్‌, బాబుపై దత్తన్న వ్యాఖ్యలు

సారాంశం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటోడని.. చంద్రబాబు అవకాశవాదన్నారు. 

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటోడని.. చంద్రబాబు అవకాశవాదన్నారు.

ఫెడరల్, మహాకూటములు దరిదాపుల్లో లేవని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 6 స్థానాల్లో బీజేపీ గట్టి పోటినిచ్చిందన్నారు. పాలమూరు ప్రాజెక్ట్‌‌పై కేసీఆర్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని.. కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.52 వేల కోట్లకు పెంచారని దత్తాత్రేయ ఆరోపించారు.

అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.80 వేలకు పెంచి ఇంత వరకు ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదన్నారు. ఇంటర్ బోర్డ్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చినా గ్లోబరీనా సంస్ధపై ఎందుకు చర్యలు తీసుకోలేదని దత్తాత్రేయ ప్రశ్నించారు. 
 
PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్