ఆన్‌లైన్ గేమింగ్, పెట్టుబడుల పేరుతో రూ. 2200 కోట్ల చీటింగ్... కీలక విషయాలు రాబట్టిన పోలీసులు

Siva Kodati |  
Published : Jan 30, 2022, 04:02 PM ISTUpdated : Jan 30, 2022, 04:06 PM IST
ఆన్‌లైన్ గేమింగ్, పెట్టుబడుల పేరుతో రూ. 2200 కోట్ల చీటింగ్... కీలక విషయాలు రాబట్టిన పోలీసులు

సారాంశం

రూ.2,200 కోట్ల నిధుల మళ్లింపు కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 13 షెల్ కంపెనీల ద్వారా చైనీయులు (china nationals) నిధులు మళ్లించినట్లు గుర్తించారు. చైనీయులకు సహకరించిన ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు.

రూ.2,200 కోట్ల నిధుల మళ్లింపు కేసులో పోలీసులు పురోగతి సాధించారు. 13 షెల్ కంపెనీల ద్వారా చైనీయులు (china nationals) నిధులు మళ్లించినట్లు గుర్తించారు. చైనీయులకు సహకరించిన ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు. హాంకాంగ్ ద్వారా చైనాకు (china) నిధులు మళ్లించారు కేటుగాళ్లు. 13 నకిలీ కంపెనీలపై ఆర్వోసీ ఫిర్యాదు చేసింది. నిందితులు ఒకే ఇంటి అడ్రస్‌తో ఐదు కంపెనీలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. 

కాగా.. ఆన్‌లైన్ గేమింగ్ (online gaming), పెట్టుబడుల పేరుతో కేటుగాళ్లు భారీ చీటింగ్‌కు పాల్పడిన సంగతి తెలిసిందే. రూ. 2,200 కోట్లకు పైగా మోసం జరిగినట్టుగా రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ గుర్తించింది. పలు బోగస్ కంపెనీలపై హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఫిర్యాదు చేసింది. నకిలీ ధ్రువ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో బోగస్ కంపెనీల నిర్వహించినట్టుగా తెలిపింది. బోగస్ కంపెనీల డైరెక్టర్లు, చైర్మన్లు, ప్రమోటర్లపై ఫిర్యాదు చేయడంతో పాటుగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. 

ఇక, కేటుగాళ్లు ఆన్‌లైన్ గేమ్స్, పెట్టుబడుల యాప్‌ల పేరుతో నగదు తరలించినట్టుగా తెలుస్తోంది. బోగస్ కంపెనీలు రూ. 2వేల కోట్లకు పైగా తరలించినట్టుగా సమాచారం. డబ్బులను హాంకాంగ్‌ తరలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మాల్ 008, మాల్ 98, YS0123, మాల్ రిబేట్. కామ్ పేర్లతో చైనీయులు ఈ మోసాలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. పెట్టుబడి పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డారు. ఇద్దరు చైనీయులు కీలకపాత్ర పోషించినట్టుగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు జరుపుతున్నారు. హవాలా మార్గంలో (hawala racket) డబ్బు తరలించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Holidays : తెలంగాణ ఉద్యోగులకు బంపరాఫర్... ఏప్రిల్ 23, 29 రెండ్రోజులు సెలవే..!
CM Revanth Reddy Super Speech: ఔర్ ఎక్ బార్ కాంగ్రెస్ సర్కార్ | TS Congress | Asianet News Telugu