కరీంనగర్ రోడ్డు ప్రమాదం: ముగ్గురు మైనర్లు సహా కారు ఓనర్ అరెస్ట్

By narsimha lodeFirst Published Jan 30, 2022, 3:45 PM IST
Highlights

కరీంనగర్ లో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదానికి  కారు ఓనర్ రాజేంద్ర ప్రసాద్ నిర్లక్ష్యం కారణంగా పోలీసులు గుర్తించారు.దీంతో ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. 

కరీంనగర్: Karimnagar పట్టణంలోని కమాన్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారు యజమాని Rajendra Prasad  నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తేల్చారు.ఈ ప్రమాదానికి పరోక్షంగా  కారణమైన రాజేంద్రప్రసాద్ ను కూడా Arrest చేశామని కరీంనగర్ సీపీ  Satyanarayana  తెలిపారు.రాజేంద్ర ప్రసాద్ తో పాటు ముగ్గురు మైనర్లు వర్ధన్, అభిరామ్,, దీక్షిత్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.

 ఆదివారం నాడు కరీంనగర్ సీపీ సత్యనారాయణ  ఓ న్యూస్ చానెల్ తో  మాట్లాడారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ముగ్గురు మైనర్లు ఉన్నారని సీపీ వివరించారు. minor కి కారు అందుబాటులో ఉంచడం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.  దీంతో రాజేంద్రప్రసాద్ ను అరెస్ట్ చేశామన్నారు. పొగమంచు కారణంగా break  కు బదులుగా యాక్సిలేటర్ ను తొక్కడంతో ప్రమాదం జరిగిందని సీపీ చెప్పారు. ఈ ప్రమాదానికి ముగ్గురు మైనర్లు కూడా కారణమని కూడా ఆయన తెలిపారు. 

ఆదివారం తెల్లవారుజామున కరీంనగర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి నిరుపేదల గుడిసెలపైకి దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ కమాన్ వద్ద కొందరు వీధివ్యాపారులు గుడిసెలు వేసుకుని వుంటున్నారు. అయితే ఇవాళ ఉదయం నలుగురు యువకులు కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళుతుండగా వీరి గుడిసెల వద్దకు రాగానే  కారు అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా కారు అతివేగంతో గుడిసెలపైకి దూసుకెళ్లింది. ఇలా గుడిసెల్లో నిద్రిస్తున్నవారిపైనుండి కారు దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని ఫరియాద్‌, సునీత, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. 
ఈ కారుపై సుమారు ఎనిమిది ఓవర్ స్పీడ్ చలాన్లు కూడా ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

మరో వైపు బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు ధర్నా చేశారు. బాధితులకు పలు రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. బాధితులతో ఆర్డీఓ మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తక్షణ సహాయంగా రూ. 10 వేలు ఇవ్వడంతో పాటు పక్కా ఇళ్లు, ఎక్స్‌గ్రేషియా ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.ఈ హామీతో ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించారు.

కారును వంద కిలోమీటర్ల స్పీడ్ తో మైనర్ బాలుడు వర్ధన్ నడిపినట్టుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు అతడికి సరిగా డ్రైవింగ్ కూడా రాదని పోలీసులు తెలిపారు.  రాంగ్ రూట్ లో కారు నడపడమే కాకుండా ఈ ప్రమాదంలో నలుగురి మరణానికి వర్ధన్ కారణమయ్యాడని పోలీసులు తెలిపారు.


 

click me!