అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. హరిహరకృష్ణ లవర్ ను కూడా ఈ కేసులో చేర్చారు పోలీసులు
హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నవీన్ హత్య కేసులో హరిహరకృష్ణ ప్రియురాలిని సోమవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నవీన్ హత్య గురించి యువతికి తెలిసినా కూడా పోలీసులకు చెప్పలేదని ఎల్ బీ నగర్ డీసీపీ సాయిశ్రీ చెప్పారు. నవీన్ హత్య కేసులో ఏ-1గా హరిహరకృష్ణ, ఏ-2 గా హసన్, ఏ-3 హరిహరకృష్ణ లవర్ ను చేర్చినట్టుగా పోలీసులు చెప్పారు.. హరిహరకృష్ణ చెప్పిన విషయాల ఆధారంగా లవర్, హసన్ లపై కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు. హరిహరకృష్ణ లవర్, హసన్ ను కూడా అరెస్ట్ చేశామని డీసీపీ సాయిశ్రీ మీడియాకు తెలిపారు.
ప్రియురాలి కోసమే నవీన్ ను హత్య చేసినట్టుగా తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత సంఘటన స్థలానికి లవర్ ను , హసన్ ను తీసుకెళ్లి నవీన్ డెడ్ బాడీని నిందితుడు చూపినట్టుగా పోలీసులు చెబుతున్నారు. నవీన్ ను హత్య చేసిన తర్వాత డెడ్ బాడీ ఫోటోలను ప్రియురాలికి వాట్సాప్ లో షేర్ చేశారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీన నవీన్ ను హరిహరకృష్ణ అత్యంత దారుణంగా హత్య చేశాడు. అబ్దుల్లాపూర్ మెట్ కు సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నవీన్ ను హత్య చేశాడు నిందితుడు.వారం రోజుల పాటు హరిహరకృష్ణను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈ నెల 3వ తేదీన హరిహరకృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు హరిహరకృష్ణ కీలక విషయాలను బయటపెట్టాడు.
నవీన్ హత్య చేసిన తర్వాత హరిహరకృష్ణకు లవర్ రూ. 1500 ఇచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్పారు. ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఎల్ బీ నగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాకు తెలిపారు. నవీన్ ను హరిహరకృష్ణ హత్య చేసే విషయం ముందే ఈ ఇద్దరు నిందితులకు తెలుసా లేదా అనే విషయమై కూడా తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
also read:యూట్యూబ్ వీడియోలు చూసి శరీర భాగాల తొలగింపు: ఇంకా దొరకని నవీన్ మొబైల్
నవీన్ ను హత్య చేసిన తర్వాత శరీర బాగాలను కోసేసి బ్రహ్మణపల్లికి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో హరిహరకృష్ణ వేశాడు. అనంతరం తన స్నేహితుడు హసన్ ఇంటికి కూడా హరిహరకృష్ణ వెళ్లాడు. నవీన్ ను హత్య చేసిన వారం రోజుల తర్వాత హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు లొంగిపోయాడు.