రాజకీయాల్లోకి వచ్చిన మహిళలను చూస్తే కొందరు ఓర్వలేరని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్పారు.
హైదరాబాద్: ఎవరినో కుక్క కరిస్తే తానే కరమనట్టుగా బురద చల్లారని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నాడు బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మ:హిళా దినోత్సవ వేడుకల్లో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. రాజకీయాల్లో మహిళల గురించి చెడుగా మాట్లాడుతారన్నారు. మహిళలు బయటకు వస్తే కొందరు ఓర్వేరని ఆమె అభిప్రాయపడ్డారు. మేయర్ గా తాను ఎన్నో బాధ్యతలు , కష్టాలను చూసినట్టుగా ఆమె తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల ప్రదీప్ అనే చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటనతో జీహెచ్ఎంసీ పై పలువురు విమర్శలు గుప్పించారు.
వీధి కుక్కలను అరికట్టడంలో జీహెచ్ఎంసీ పాలకవర్గం వైఫల్యం చెందినట్టుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలపై ఇవాళ ఆమె పరోక్షంగా స్పందించారు. రాష్ట్రలలోని పలు జిల్లాల్లో వీధి కుక్కల దాడులు చోటు చేసుకుంటున్నాయి. వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించింది.